బిల్ అండ్ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టరుగా భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచ్చర్..

First Published Jun 4, 2021, 1:59 PM IST

ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మానవ వనరుల విభాగం హెడ్  బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా చేరానున్నారు. గత మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో సేవలందించిన ఆమే వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. 

అంతర్జాతీయ ద్రవ్య నిధిలో మూడు దశాబ్దాలుగా వివిధ సీనియర్ పదవుల్లో పనిచేసిన కొచ్చర్ జూలై 30న పదవీ విరమణ చేశాక బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డెవలప్‌మెంట్ పాలసీ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా చేరనున్నట్లు ఐఎంఎఫ్ బుధవారం ప్రకటించింది.
undefined
కల్పన కొచ్చర్ తన 33 సంవత్సరాలలో కేరీర్ లో బలమైన నాయకత్వం, ఫండ్ మిషన్‌కు అంకితభావానికి ఒక అద్భుతమైన ఉదాహరణను ఇచ్చింది. ఆమె తన పని పట్ల తెలివితేటలు, గొప్ప పాషన్ కనబరిచింది. ఆమె తన కొత్త పాత్రలో చాలా ఉత్తమమైనదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని ఐ‌ఎం‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు.
undefined
మానవ వనరుల డైరెక్టర్‌గా కల్పన కొచ్చర్ ఐ‌ఎం‌ఎఫ్ హెచ్‌ఆర్ విధానాలను వాషింగ్టన్, డి‌సి, విదేశీ కార్యాలయాలలో ఉన్న దాదాపు 150 దేశాల నుండి 4,000 మందికి పైగా ఐ‌ఎం‌ఎఫ్ ఉద్యోగులను నియమించడంలో పర్యవేక్షించారు.మొదటి నుంచి చివరి వరకు కల్పన కొచ్చర్ మేనేజ్‌మెంట్ బృందానికి, ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు మంచి సలహాలను అందించింది. అలాగే హెచ్‌ఆర్ సంబంధిత అన్నీ విషయాలలో అద్భుతమైన తీర్పును ప్రదర్శించింది అని జార్జివా చెప్పారు.
undefined
తన కెరీర్ మొత్తంలో కల్పనా కొచ్చార్ సంస్థలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సమస్యలపై మార్పులకు మార్గదర్శకత్వం వహించింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో కొచార్ కేరింగ్ స్పిరిట్ స్పష్టంగా కనబడుతుందని జార్జివా చెప్పారు.స్ట్రాటజీ , పాలసీ, రివ్యూ డిపార్ట్‌మెంట్ (ఎస్‌పిఆర్) లో డిప్యూటీ డైరెక్టర్‌గా జెండర్ ఈక్విటీ, ఇన్కమ్ ఇన్ ఈక్వాలిటీ, ఉద్యోగాలు, వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలపై పరిశోధన, విధాన రూపకల్పనకు ఆమె నాయకత్వం వహించారు.
undefined
వీటికి ముందు కల్పనా కొచ్చర్ పరిశోధనా విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ సీనియర్ పర్సనల్ మేనేజర్. కల్పనా కొచ్చర్‌ దక్షిణ ఆసియా ప్రాంతానికి చీఫ్ ఎకనామిస్ట్‌గా రెండేళ్లపాటు ప్రపంచ బ్యాంకుకు వ్యవహరించిన రెండవ వ్యక్తి. ఇందులో ఆసియాపై ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానం, అనుభవాన్ని అందించారు. ఇంకా ఈ ప్రాంతాలలో బ్యాంకుకు సహాయం చేయడానికి ఆ ప్రాంతానికి చెందిన ఆర్థికవేత్తలు, విదేశాంగ విధాన నిపుణులతో ఉన్నత స్థాయి సలహా బృందాన్ని ఏర్పాటు చేసింది అని ఒక మీడియా ప్రకటన తెలిపింది.కల్పనా కొచ్చర్ 1988లో ఐఎమ్‌ఎఫ్‌ ఎకనామిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. ఐ‌ఎం‌ఎఫ్ లో చేరడానికి ముందు వాషింగ్టన్ డి‌సిలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.కల్పనా కొచ్చర్ ఒక రచయిత. ఆసియా, జెండర్, అనేక రకాల అభివృద్ధి సమస్యలపై ఆమె చేసిన పరిశోధనలు ఐ‌ఎం‌ఎఫ్ వర్కింగ్ పేపర్లు, స్టాఫ్ డిస్కషన్ నోట్స్, పుస్తకాలు, బ్లాగులు, ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ మ్యాగజైన్‌తో సహా ప్రచురణలలో కనిపించాయని ఐ‌ఎం‌ఎఫ్ మీడియా రిలీజ్ లో తెలిపింది.
undefined
click me!