razorpay
youngest billionaires :ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?.. అంటే టక్కున ఎలాన్ మస్క్ పేరు వినిపిస్తుంది. ఇక భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే టక్కున ముఖేష్ అంబానీ పేరు గుర్తొస్తుంది. మరి దేశంలో అతి చిన్న వయసుగల బిలియనీర్స్ ఎవరు? వారి సంపద ఎంత? వారు చేసే వ్యాపారం ఏమిటి? ఈ ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలియదు. ఇక్కడ యంగెస్ట్ బిలియనీర్స్ గురించి తెలుసుకుందాం.
Harshil Mathur & Shashank Kumar
ఎవరీ శశాంక్ కుమార్, హర్షిల్ మాథూర్?
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఇద్దరు భారతీయ యువకులు సంపాదనలో చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీల విషయంలో భారత్ టాప్ లో ఉంది... ఇది ముందే గుర్తించిన శశాంక్ కుమార్, హర్షిల్ మాథూర్ రేజర్ పే ను స్థాపించారు. ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్స్ చాలా సులభంగా పూర్తిచేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపిఐ లను ఉపయోగించి ఈ రేజర్ పే ద్వారా సురక్షితంగా ఆన్ లైన్ పేమెంట్స్ చేయవచ్చు.
అతి చిన్న వయసులోనే ఫిన్ టెక్ కంపనీని స్థాపించి ఈ రేజర్ పే ను అందుబాటులోకి తీసుకువచ్చారు శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్. 2014లో ప్రారంభమైన ఈ స్టార్టప్ అతి తక్కువ కాలంలోనే బాగా అభివృద్ధి చెందడంతో ఈ ఇద్దరు వేలకోట్లు సంపాదించారు. దీంతో దేశంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ గా అవతరించారు. కేవలం 34 ఏళ్ళ వయసులోనే ఒక్కొక్కరి నికర ఆదాయం విలువ రూ.8,643 గా ఉంది.
తాజాగా హురుర్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 లో రేజర్ పే వ్యవస్థాపకులు శశాంక్, హర్షిల్ కు చోటుదక్కింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,442 మంది బిలియనీర్స్ ఉన్నారు... గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 163 మంది కొత్తగా బిలియనీర్స్ గా అవతరించారు. వీరిలో ఇండియా నుండి శశాంక్, హర్షిల్ కు చోటు దక్కింది.
Mukesh Ambani
టాప్ 10 ప్రపంచ ధనవంతుల జాబితా ... ముఖేష్ అంబానీకి దక్కని చోటు :
హురుర్ గ్లోబల్ రిచెస్ట్ పర్సన్స్ 2025 లిస్ట్ లో మళ్ళీ అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ 420 బిలియన్ డాలర్లతో టాప్ లో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 266 బిలియన్ డాలర్లు, మెటా యజమాని మార్క్ జుకన్ బర్గ్ 242 బిలియన్ డాలర్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్, బెర్క్ షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇలా టాప్ 5 ప్రపంచ కుభేరులు అమెరికాకు చెందినవారే.
టాప్ 10 వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్స్ జాబితాలో ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చోటు దక్కలేదు. ఆయన ఈసారి 17వ స్థానంలో నిలిచారు. అయితే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మాత్రం ముఖేష్ అంబానీ నిలిచారు. అంబానీ తర్వాత గౌతమ్ అదానీ 99.7 బిలియన్ డాలర్లతో 18వ స్థానంలో నిలిచారు.