Price Hike: పండుగ సీజన్‌లో షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు.. అసలు కారణం ఇదే

Published : Sep 28, 2026, 10:00 AM IST

Price Hike: దసరా, దీపావళి పండుగల షాపింగ్ సీజన్‌లో వినియోగదారులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 5% నుండి 8% వరకు పెంచేందుకు వివిధ కంపెనీలు నిర్ణయించాయి. అసలు ఎందుకు ధరలు పెరుగుతున్నాయి?

PREV
16
టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు పైపైకి

దసరా, దీపావళి పండుగలు వచ్చేశాయంటే ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లకు కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు కొనడానికి రెడీ అవుతుంటారు. కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈసారి కస్టమర్లకు గట్టి షాక్ తగలనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 5% నుంచి 8% వరకు పెంచుతున్నట్లు ప్రముఖ తయారీ సంస్థలు స్పష్టం చేశాయి.

26
వరుసగా మూడోసారి భారం.. అసలు కారణాలేంటి?

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి 2026 సంవత్సరంలో ఇది వరుసగా మూడో విడత ధరల పెంపు కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఉత్పత్తుల వ్యయం పెరుగుతున్నప్పటికీ కంపెనీలే ఆ భారాన్ని భరిస్తూ వచ్చాయనీ, కానీ ఇప్పుడు లాభాల శాతాలు తగ్గిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రధానంగా కాపర్, స్టీల్, అల్యూమినియం, ముడి చమురు ఆధారిత ప్లాస్టిక్ పదార్థాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆకాశాన్నంటాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ సంక్షోభం, అంతర్జాతీయ రవాణా ఖర్చులు పెరగడం, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అంశాలు కంపెనీల నిర్వహణ వ్యయాన్ని విపరీతంగా పెంచేశాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

36
ఒక్కో ప్రోడక్ట్‌పై ఎంత పెంపు ఉందంటే?

ఏసీల తయారీకి కాపర్ అత్యంత కీలకం. గతంలో మెట్రిక్ టన్ను రాగి ధర 8,000 నుంచి 9,000 డాలర్లు ఉంటే, ఇప్పుడు అది ఏకంగా 14,500 డాలర్లకు చేరింది. దీంతో ఏసీల ధరలు అత్యధికంగా 5% నుంచి 8% వరకు పెరగనున్నాయి. ఇక వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 2% నుంచి 4% వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

బ్లూస్టార్, గోద్రెజ్, హైయర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్, వోల్టాస్ వంటి దిగ్గజ బ్రాండ్లు ధరల పెంపును ధృవీకరించాయి. ఎల్‌జీ, బాష్, పానాసోనిక్ వంటి సంస్థలు కూడా ఏసీల ధరలను 5% వరకు పెంచే ఆలోచనలో ఉన్నాయి.

46
పాత స్టాక్ పై ఆఫర్లు

ఈ ధరల బాదుడు మధ్య కొనుగోలుదారులకు ఒక మంచి వార్త కూడా ఉంది. కంపెనీలు కొత్త ధరలను ప్రకటించినప్పటికీ, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఇప్పటికే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కొనుగోలు చేసిన పాత సరుకు నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి.

సుమారు నెల నుంచి నెలన్నర రోజులకు సరిపడే పాత స్టాక్ అందుబాటులో ఉన్నందున, దీపావళి పండుగ ముగిసే వరకు వినియోగదారులు పాత ధరలకే ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీపావళి పూర్తయిన తర్వాతే కొత్త ధరలు మార్కెట్‌లో పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

56
2030 నాటికి రూ.3.25 లక్షల కోట్లకు మార్కెట్

ఒకవైపు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారతీయ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), సీఐఐ (CII) రిపోర్టులు పేర్కొన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ రూ.3 నుంచి 3.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలవనుంది.

మొత్తానికి, మీ ఇంట్లోకి ఏసీ, టీవీ లేదా వాషింగ్ మెషిన్ లాంటివి కొనాలని ప్లాన్ చేస్తుంటే, డీలర్ల వద్ద పాత స్టాక్ ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిపని.

66
వాహనాల ధరలు కూడా ప్రియం

కేవలం గృహోపకరణాలే కాకుండా ఆటోమొబైల్ రంగంలోనూ ధరల సెగ తగులుతోంది. లోహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ధరలను కూడా పెంచాలని యోచిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, టాటా కార్ల ధరలు కూడా పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఇది విడతల వారీగా ఉంటుందని టీఎంపీవీ పేర్కొంది. ఇక మారుతి సుజుకి కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రెండు వారాల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories