ETT లిమిటెడ్‌లో ప్రొమోటర్లు సుమారు 65% వాటాను కలిగి ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) 10% వాటాను కలిగి ఉన్నారు. దీని వల్ల కంపెనీ భవిష్యత్ పై అంతర్గత వాటాదారులు, పెద్ద పెట్టుబడిదారుల నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ PE రేషియో సుమారు 17గా ఉంది, కానీ రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలలో ఇది సగటున 40 ఉంటుంది. అంటే ఈ స్టాక్ తన అంతర్గత విలువ కంటే చాలా తక్కువ ధరకు ట్రేడవుతోంది. కంపెనీ ప్రదర్శన, డీల్ గురించి మార్కెట్‌లో వార్తలు వ్యాప్తి చెందుతూనే ఉన్న నేపథ్యంలో, విలువ విడుదల (Value Unlocking) అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు.
ETT లిమిటెడ్ టెక్నికల్ చార్ట్స్ కూడా స్పష్టమైన అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. RSI (Relative Strength Index), MACD (Moving Average Convergence Divergence) లాంటివి బులిష్ జోన్‌లో ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా నిరంతరం పెరుగుతోంది. చార్ట్‌లో క్లియర్ బ్రేకౌట్ కనిపిస్తోంది. అంటే షార్ట్ నుంచి మీడియం టర్మ్ వరకు స్టాక్ ర్యాలీకి సిద్ధంగా ఉందని అర్థం. ఇప్పటికే చాలా మంది పెట్టుబడిదారులు నెమ్మదిగా ఈ స్టాక్‌ను సేకరిస్తున్నారు ఇది రాబోయే ర్యాలీకి సంకేతంగా చెప్పొచ్చు.
డిజిటల్ ఇండియా యుగంలో, ఈ స్టాక్ ఒక మాస్టర్‌స్ట్రోక్ అవొచ్చు:
ఇండియాలో డిజిటల్ మీడియా, టెక్నాలజీ భవిష్యత్తు చాలా వెలుగైనదిగా కనిపిస్తోంది. అలాంటి సమయంలో, స్థిరంగా పనిచేస్తున్న, లాభదాయకమైన, రుణ రహితమైన, రూ. 60 కోట్లు విలువైన అంతర్జాతీయ ఆర్డర్ గెలిచిన కంపెనీగా నిలిచింది. పైగా అదే కంపెనీ రూ. 14 కన్నా తక్కువ ధరకు ట్రేడవుతుంటే, అది పెట్టుబడిదారులకు బంగారు అవకాశం. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సమయానికి ETT లిమిటెడ్‌లో పెట్టుబడి పెడితే, రాబోయే సంవత్సరాల్లో భారీగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంది.