EPFO Rules: EPFOలో ఎన్నో మార్పులు ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన కొత్త ఈపీఎఫ్‌వో నియమాలు ఇవిగో

Published : Nov 09, 2025, 02:23 PM IST

EPFO Rules: ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఉద్యోగులందరికీ సులభమైన ప్రక్రియలను ప్రారంభించింది. ప్రతి ఉద్యోగి ఈ నియమాలు, ప్రక్రియలు గురించి తెలుసుకోవాలి. 2025లో ఎన్నో ఈవీఎఫ్‌వో నియమాలు మారాయి. 

PREV
15
ఇప్పుడు పూర్తిగా ఆటోమేటిక్‌గా

ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు పాత సంస్థలో ఉన్న EPF (Employees Provident Fund) ఖాతా నుంచి కొత్త సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేయడం ఇప్పటి వరకు ఒక పెద్ద ప్రక్రియగా ఉండేది. ఫారమ్-13 నింపడం, పాత సంస్థ ఆమోదం, కొత్త సంస్థ ధృవీకరణ వంటి దశల వల్ల చాలా మందికి ఆలస్యం జరిగేది. అయితే 2025 నుంచి ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. EPFO (Employees Provident Fund Organisation) కొత్త నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై EPF ట్రాన్స్‌ఫర్ పూర్తిగా ఆటోమేటిక్‌గా మారబోతోంది.

25
ఈ పని చేస్తే చాలు

ఉద్యోగి కొత్త కంపెనీలో చేరిన వెంటనే, ఆ సంస్థ ఉద్యోగి జాయినింగ్ తేదీని EPFO పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత, పాత EPF ఖాతాలోని మొత్తం నిధులు ఆటోమేటిక్ గా కొత్త ఖాతాకు బదిలీ అవుతాయి. అంటే ఇకపై ఎటువంటి ఫారమ్ నింపాల్సిన అవసరం లేదు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా తమ నిధులను సురక్షితంగా కొనసాగించగలరు.

35
యూఏఎన్ నెంబర్ తో

ప్రతి ఉద్యోగికి ఒకే UAN (Universal Account Number) ఉంటే చాలు. కొత్త ఉద్యోగంలో చేరినా, అదే UAN ద్వారా EPF ఖాతా కొనసాగుతుంది. దీనివల్ల పాత, కొత్త ఖాతాలను కలపాల్సిన అవసరం ఉండదు.

45
వారం రోజుల్లో పూర్తి

EPFO ప్రకారం, ఆధార్ ఆధారిత e-KYC, e-Sign సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇప్పటివరకు 30–45 రోజులు పట్టే EPF బదిలీ ఇప్పుడు సుమారు 7–10 రోజుల్లో పూర్తి అవుతుంది. ట్రాన్స్‌ఫర్ పూర్తయిన వెంటనే, పాత ఖాతాలో నగదు సున్నాగా కనిపించి, కొత్త ఖాతాలో మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది.

55
ఈ మార్పుల వల్ల ప్రయోజనాలు

పాత సంస్థ ఉద్యోగి ఎగ్జిట్ డేట్‌ను అప్‌డేట్ చేయకపోతే, ఉద్యోగి ఆధార్ OTP ద్వారా స్వయంగా తన ఎగ్జిట్ తేదీని డిక్లేర్ చేయవచ్చు. ఈ సమాచారం సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా ధృవీకరిస్తుంది. అలాగే ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా EPF డబ్బుపై వడ్డీ కొనసాగుతుంది.

ఈ మార్పుల వల్ల ప్రయోజనాలు

1. ఉద్యోగం మారినప్పుడు డబ్బు బదిలీ సులభతరం అవుతుంది.

2. పాత సంస్థల అనుమతి అవసరం ఉండదు.

3. వడ్డీ నష్టం లేకుండా నిధులు కొనసాగుతాయి.

4. ఒక్క UAN ద్వారా జీవితాంతం ఖాతా కొనసాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories