ఇష్టారాజ్యంగా వెండి కొంటున్నారా.? భారీగా జ‌రిమానా చెల్లించ‌క త‌ప్ప‌దు

Published : Nov 09, 2025, 12:52 PM IST

Silver: వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డంతో చాలా మంది సిల్వ‌ర్‌పై పెట్టుబ‌డి పెడుతున్నారు. అయితే ఇంట్లో ఎంత వెండి ఉండొచ్చు.? దీనికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వెండి ఉంచుకోవడంపై లిమిట్ ఉందా?

మన దేశంలో బంగారం మాదిరిగా వెండి కూడా ఆభరణాలు, పాత్రలు, పెట్టుబడిగా వాడుతున్నారు. అయితే ఇంట్లో ఎంత వెండి ఉండొచ్చు, దీనికి RBI ఏమైనా లిమిట్ పెట్టిందా? ల‌ఆంటి సందేహాలు వ‌స్తుంటాయి. అయితే ఆదాయపు పన్ను శాఖ కానీ వెండి ఉంచుకోవడంపై ఎలాంటి పరిమితి పెట్టలేదు. అంటే మీరు చట్టబద్ధంగా కొనుగోలు చేసినా, లేదా వారసత్వంగా పొందినా, ఎంత వెండైనా ఇంట్లో ఉంచుకోవచ్చు.

25
బిల్లు, రశీదు తప్పనిసరి

వెండిపై పరిమితి లేకపోయినా, కొనుగోలు చేసినప్పుడు తీసుకున్న బిల్లు లేదా రశీదు తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేసినప్పుడు, మీరు వెండి చట్టబద్ధంగా కొనుగోలు చేశారని నిరూపించడానికి రశీదు అవసరం అవుతుంది. ఒక‌వేళ బిల్లు లేక‌పోతే అధికారులు దానిని అన్‌డిక్లేర్డ్ అసెట్‌గా భావిస్తారు. దీంతో పన్ను లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

35
వెండిని అమ్మితే పన్ను ఎలా ఉంటుంది?

మీరు వెండిని పెట్టుబడిగా కొనుగోలు చేసి తర్వాత అమ్మి లాభం పొందితే, దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వస్తుంది. మీరు వెండిని 24 నెలలలోపు అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) కింద పన్ను పడుతుంది. ఇది మీ ఆదాయపు పన్ను శ్రేణి (Income Tax Slab) ప్రకారం ఉంటుంది. 24 నెలల తర్వాత అమ్మితే → లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) కింద వస్తుంది.

45
2024 తర్వాత కొత్త ట్యాక్స్ నియమాలు

జూలై 23, 2024 తర్వాత కొనుగోలు చేసిన వెండిపై 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఇందులో ద్రవ్యోల్బణం సర్దుబాటు (Indexation) ప్రయోజనం ఉండదు. అయితే జూలై 23, 2024కు ముందు కొనుగోలు చేసిన వెండిపై పాత నియమాల ప్రకారం 20% పన్ను మాత్రమే ఉంటుంది, అందులో ద్రవ్యోల్బణ ప్రయోజనం (Indexation benefit) కూడా లభిస్తుంది.

55
ఆన్‌లైన్ వెండి పెట్టుబడులు – సురక్షితం, సులభం

మీరు ఫిజికల్ వెండి కొనకుండా సిల్వర్ ETF లేదా సిల్వర్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే కూడా పన్ను నియమాలు దాదాపు అలాగే ఉంటాయి. ఇవి ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకం జరగడంతో రికార్డులు ముందుగానే ఉంటాయి. అందువల్ల ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో సాక్ష్యాలు చూపడం చాలా సులభమ‌వుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories