క్రెడిట్ లిమిట్ పెంచుకోమమని మీక్కూడా మెసేజ్‌లు వ‌స్తున్నాయా.. పెంచితే లాభ‌మా, న‌ష్ట‌మా.?

Published : Nov 09, 2025, 12:10 PM IST

Credit card: బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కాగా ఈ కార్డుల‌ను ఉప‌యోగించే వారికి లిమిట్ పెంచుకోవ‌డానికి మెసేజ్‌లు వ‌స్తుంటాయి. అయితే లిమిట్ పెంచుకోవ‌డం వ‌ల్ల కలిగే లాభ‌, న‌ష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
క్రెడిట్ కార్డ్ లిమిట్

క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటే.. కార్డు ద్వారా మీరు గ‌రిష్టంగా చేయ‌గ‌లిగే ట్రాన్సాక్ష‌న్ విలువ‌. నేటి కాలంలో క్రెడిట్ కార్డులు మన ఆర్థిక జీవితంలో ముఖ్యమైన భాగమయ్యాయి. రోజువారీ ఖర్చులు, ఆన్‌లైన్‌ షాపింగ్, ఎమర్జెన్సీ అవసరాలు.. వీటన్నింటిలో క్రెడిట్ కార్డ్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. కానీ చాలామంది "క్రెడిట్ లిమిట్ పెంచితే మంచిదా?" అనే సందేహంలో ఉంటారు.మ‌రి లిమిట్ పెంచుకోవడం వల్ల వచ్చే లాభాలు, నష్టాలు ఇప్పుడు చూద్దాం.

25
లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలు

కొనుగోలు శక్తి పెరుగుతుంది:

లిమిట్ పెంచితే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయొచ్చు. పెద్ద బిల్లులు లేదా అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు కూడా మీ కార్డ్‌ “మ్యాక్స్ అవుట్” అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది

లిమిట్ పెరిగితే, మీ “క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో” (ఉపయోగిస్తున్న మొత్తం vs మొత్తం లిమిట్) తగ్గుతుంది. తక్కువ రేషియో అంటే మంచి క్రెడిట్ స్కోర్ అని అర్థం. దీని వల్ల భవిష్యత్తులో లోన్లు లేదా కొత్త క్రెడిట్ కార్డులు పొందడం సులభమవుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో సాయం

అనుకోని పరిస్థితుల్లో (ఆసుపత్రి ఖర్చులు, అత్యవసర ప్రయాణం వంటి) ఎక్కువ లిమిట్ ఉండటం ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

రివార్డులు, ఆఫర్లు ఎక్కువ

కొన్ని ప్రీమియం కార్డులు అధిక లిమిట్ ఉన్న కస్టమర్లకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్, ట్రావెల్ రివార్డులు, లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఇస్తాయి. ఉదాహరణకు Airtel Axis Bank Credit Card ద్వారా రీచార్జ్‌లపై 25% క్యాష్‌బ్యాక్, బిల్‌ పేమెంట్లపై 10% క్యాష్‌బ్యాక్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తాయి. ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

35
లిమిట్ పెంచుకోవ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు.

ఎక్కువ ఖర్చు చేసే అవ‌కాశం

లిమిట్ ఎక్కువగా ఉన్నప్పుడు “ఇంకా కొంచెం ఖర్చు చేద్దాం” అనే భావన వస్తుంది. దీని వల్ల అధిక బకాయిలు, అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అప్పుల భారం పెరగడం

ఎక్కువ లిమిట్ అంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. చెల్లించలేకపోతే వడ్డీ, లేట్ ఫీజులు పెరిగి ఆర్థిక ఒత్తిడి వస్తుంది.

క్రెడిట్ స్కోర్‌ పడిపోవచ్చు

తప్పుగా ఉపయోగిస్తే లిమిట్ పెరిగినా ప్రయోజనం ఉండదు. బకాయిలు ఎక్కువగా ఉండటం లేదా చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల స్కోర్ తగ్గిపోతుంది.

అదనపు ఫీజులు, వడ్డీ రేట్లు

కొన్ని బ్యాంకులు అధిక లిమిట్ ఉన్న కార్డులపై వార్షిక ఫీజులు లేదా అధిక వడ్డీ వసూలు చేస్తాయి. లిమిట్ పెంచే ముందు ఈ వివరాలు తెలుసుకోవాలి.

ఆర్థిక నియంత్రణ అవసరం

లిమిట్ పెరిగిన తర్వాత ఖర్చులను కట్టడి చేయడం కష్టమవుతుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే లిమిట్ పెరగడం మంచిది కాదు.

45
క్రెడిట్ లిమిట్ ఎలా పెంచుకోవాలి?

బ్యాంక్‌ యాప్‌, వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా లిమిట్ పెంచేందుకు అభ్యర్థించవచ్చు. బ్యాంక్‌ మీ ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, పేమెంట్ హాబిట్స్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో బ్యాంకులు మీ లావాదేవీ ఆధారంగా నేరుగా మీ ఫోన్‌కి మెసేజ్‌లు పంపిస్తాయి. అందులో పేర్కొన్న‌ట్లు చేస్తే వెంట‌నే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుంది.

55
క్రెడిట్ కార్డుకు సంబంధించి కొన్ని ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు:

* లిమిట్ పెంచితే స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?

బాధ్యతగా వాడితే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. కానీ అధిక బకాయిలు ఉంటే నెగెటివ్ ప్రభావం ఉంటుంది.

* లిమిట్ పెంచడం ఎప్పుడైనా మంచిదా?

మీ ఖర్చులను నియంత్రించగలుగుతారంటే, లిమిట్ పెంచుకోవడం మంచిది. కానీ ఖర్చు నియంత్రణ లేని వారికి ఇది ప్రమాదం.

* లిమిట్ పెరిగితే ఫీజులు ఉంటాయా?

కొన్ని బ్యాంకులు అధిక లిమిట్ కార్డులపై వార్షిక ఫీజులు వసూలు చేస్తాయి. దాని గురించి ముందుగానే తెలుసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories