EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..

Published : May 19, 2025, 05:01 PM IST

EPFO తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు PF బ్యాలెన్స్, డబ్బులు తీసుకోవడం, పెన్షన్ సమాచారం తెలుసుకోవడం చాలా సింపుల్. ఒక్క క్లిక్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కూడా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
EPFO కొత్త రూల్స్

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇటీవల కొన్ని కీలక మార్పులు తీసుకువచ్చింది. 2025 సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఈ కొత్త విధానాలతో దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా డిజిటల్ సేవలను మరింత ఈజీగా పొందే అవకాశం కల్పించారు.  

25
10 భాషల్లో సమాచారం

ఈ మార్పుల ప్రకారం PF బ్యాలెన్స్ తనిఖీ, విత్‌డ్రా ప్రక్రియ, పెన్షన్ సమాచారం పొందడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. EPFO సంబంధిత డేటాను ఒక్క క్లిక్‌తో పొందే వీలును కల్పించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అదనంగా పది భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది.

35
కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయండి

EPFO సేవలకు సంబంధించి మొత్తం సమాచారం ఇప్పుడు ఒక్క క్లిక్‌లో పొందవచ్చు. మీరు రిజస్టర్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా EPFO సేవలన్నింటికీ యాక్సెస్ కల్పించారు. మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మిస్డ్ కాల్ లేదా SMS పంపడం ద్వారా PF బ్యాలెన్స్, పెన్షన్ సమాచారం లభిస్తుంది.

45
ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడానికే..

జనవరి 15, 2025 నుండి ఖాతా మార్పులు, వివరాల అప్‌డేట్ మొదలైనవి కంపెనీ లేదా యజమాని అనుమతి లేకుండానే చేసుకునే వీలు కూడా కల్పించారు. ఈ విధంగా EPFO డిజిటలైజేషన్‌తో ఉద్యోగులకి సేవల పరంగా పెద్ద ప్రయోజనం కలిగే మార్గం ఏర్పడింది. వేగంగా, సులభంగా, పారదర్శకంగా సేవలు అందించడమే ఈ కొత్త విధానాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

55
మొబైల్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి

ఈ మార్పులు EPFO సేవల వినియోగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగుల సమయాన్ని ఆదా చేస్తాయి. దీంతో పీఎఫ్ సమాచారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 

గమనిక: ఈ సేవలు మీరు వినియోగించుకోవాలంటే ఉద్యోగుల EPFO అకౌంట్ కు తమ ఆధార్, మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉంచుకోవాలి. ఇలా చేసిన వాటికే ఈ సేవలు అందుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories