బంగారం, వెండి ధరల పరుగు.. కొనే ముందు మీ నగరంలో పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

First Published Dec 3, 2021, 12:03 PM IST

ఈ వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం బంగారం, వెండి ధరలు(gold prices)  కాస్త పెరిగాయి. ఎం‌సి‌ఎక్స్ లో 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 0.39 శాతం పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం(gold) ధర రూ.47,585కి చేరింది. అలాగే  వెండి(silver) ధర కూడా పెరిగింది, దీని ధర 0.15 శాతం పెరిగి కిలో రూ. 61,214కి చేరుకుంది.

 0439 GMT నాటికి స్పాట్ బంగారం ధర 0.2 శాతం పెరిగి ఔన్సుకు 1,772.41డాలర్లకి చేరుకుంది. ఒక డేటా ప్రకారం యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి 1,773.30డాలర్లకి చేరుకుంది.

ఈ విధంగా బంగారం స్వచ్ఛతను తెలుసుకోండి,
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారం ధర మారుతుంటుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్లను ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్‌ మార్క్‌ను ముద్ర  వేస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250 కాగా, ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 46,080కి కొనుగోలు చేయవచ్చు. కోల్‌కతాలో రూ. 46,400 కాగా  చెన్నైలలో రూ. 44,170కి విక్రయిస్తున్నారు.


ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 47,080. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. కోల్‌కతాలో  24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 కొనుగోలు చేయవచ్చు, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.48,190గా ఉంది.


హైదరాబాద్, పూణే వంటి ఇతర ముఖ్యమైన నగరాల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 అలాగే రూ. 45,320గా అంచనా వేయబడింది. ఇంకా ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం అమ్మకపు ధర రూ. 48,110 అలాగే రూ. 48,570గా ఉంది.

గురువారం కామేక్స్ (comex)విభాగంలో బంగారం ధరలు 4 వారాల కనిష్టానికి పడిపోయాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.98% నష్టంతో 10 గ్రాములకు రూ. 47,401 వద్ద, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.30% నష్టంతో కిలోగ్రాముకు రూ.61,123 వద్ద స్థిరపడింది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయని, ఫెడ్‌ వడ్డీరేటు అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు.

"ఇటీవలి క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల ద్రవ్యోల్బణం వైపు సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ పెరుగుతున్న కేసులు మార్కెట్లలో అస్థిరతను పెంచుతూనే ఉన్నాయి, అయినప్పటికీ బంగారం వ్యాపారులు ద్రవ్యోల్బణం, ఫెడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు" అని జైన్ చెప్పారు.

టెక్నీకల్ చెక్:
ఎం‌సి‌ఎక్స్ గోల్డ్ ఫిబ్రవరి 47,500 స్థాయి కంటే దిగువన ట్రేడవుతుంటే, అది ప్రతికూల ధోరణిని 47,223-47,045 స్థాయిల వరకు కొనసాగించవచ్చు. రెసిస్టెన్స్ జోన్ 47705-48010 స్థాయిలలో ఉంది.  
అదేవిధంగా, ఎం‌సి‌ఎక్స్ సిల్వర్ మార్చ్ 61,120 స్థాయి కంటే దిగువన ట్రేడవుతుంటే, అది 60756-60389 స్థాయిల వరకు బుల్లిష్ మొమెంటమ్‌ను చూడవచ్చు. రెసిస్టెన్స్ జోన్ 61485-61847 స్థాయిలలో ఉంది.


మీ నగరంలో బంగారం, వెండి ధరలు
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరంలో బంగారం ధరను మొబైల్‌లో కూడా చెక్ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరలను చెక్ చేయవచ్చు. 

click me!