EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కీలక మార్పులు చేయబోతోంది. ముఖ్యంగా PF డబ్బులు ఉపసంహరించుకునే ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం EPFO కేవలం రూ. 5 లక్షల వరకు ఉన్న అడ్వాన్స్ లేదా పార్ట్ విత్‌డ్రా క్లెయిమ్‌లను మాత్రమే ఆటోమేటిక్ విధానంలో ప్రాసెస్ చేస్తోంది. ఈ క్లెయిమ్‌లు సాధారణంగా మూడు రోజుల్లో పరిష్కారమవుతున్నాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని పూర్తి PF సెటిల్‌మెంట్‌కు కూడా వర్తింపజేయాలని EPFO యోచిస్తోంది. దీని వల్ల ఉద్యోగం వదిలిన తర్వాత PF డబ్బుల కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. డబ్బులు నేరుగా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో వేగంగా జమ అవుతాయి.
25
7 కోట్ల మంది ఉద్యోగులకు లాభం
EPFO పరిధిలో ప్రస్తుతం 7 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్త మార్పులు అమల్లోకి వస్తే ఈ ఉద్యోగులందరికీ పెద్ద ఊరట లభించనుంది. EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, “ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. ఇప్పటివరకు ఈ సదుపాయం అడ్వాన్స్ విత్‌డ్రాలకు మాత్రమే ఉండగా, త్వరలో పూర్తి PF సెటిల్‌మెంట్‌కు కూడా విస్తరించనుంది.
35
ఉద్యోగం మారితే PF ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్
ఇంకో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే PF అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కూడా ఆటోమేటిక్‌గా జరగనుంది. ఇప్పటివరకు PF ట్రాన్స్‌ఫర్ కోసం ఫారమ్‌లు నింపాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంలో ఎలాంటి ఫామ్ అవసరం లేకుండా పాత PF ఖాతా నుంచి కొత్త ఖాతాకు డబ్బులు ఆటోమేటిక్‌గా మారతాయి. దీంతో ఉద్యోగులకు సమయం ఆదా కావడమే కాకుండా, ప్రక్రియ మరింత సులభమవుతుంది.
EPFO తీసుకురాబోతున్న మరో కీలక సౌకర్యం ఏటీఎమ్, UPI ద్వారా PF డబ్బులు ఉపసంహరించుకునే విధానం. ఈ సదుపాయం EPFO 3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా అందుబాటులోకి రానుంది. సమాచారం ప్రకారం, మే నెలాఖరు నాటికి ఈ ఫీచర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేక EPFO ఏటీఎమ్ కార్డులు కూడా జారీ చేసే అవకాశముంది. దీంతో EPFO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ATMల ద్వారా PF డబ్బులు తీసుకోవచ్చు.
55
కొత్త లేబర్ కోడ్‌లో కీలక మార్పులు
కొత్త కార్మిక చట్టాల ప్రకారం EPFOకి సంబంధించిన మూడు ప్రధాన పథకాలను మళ్లీ నోటిఫై చేయనున్నారు. EPF స్కీమ్ 1952, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995. ఈ మార్పులతో ఉద్యోగులకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా EPFO ముందడుగు వేస్తోంది.