Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 40 లక్షలు పైమాటే..! ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై ఓ లుక్కేయండి..

Published : Feb 07, 2026, 08:00 AM IST

Multibagger Stock: RDB Infrastructure & Power.. సుమారు 5 సంవత్సరాల్లో 4 వేల శాతం పైగా ఈ స్టాక్ పెరిగి.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. వ్యాపార వృద్ది, ప్రాజెక్టులు లాంటివి ఈ కంపెనీ పెరుగుదలకు ఉపయోగపడ్డాయి. ఆ వివరాలు ఇలా.. 

PREV
15
5 ఏళ్లలో 4 వేల శాతం వృద్ధి..

RDB Infrastructure & Power కంపెనీ సుమారు 5 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన గ్రోత్ సాధించింది. సాధారణ స్టాక్ గా తన ప్రయాణాన్ని స్టాక్ మార్కెట్ లో ప్రారంభించి.. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే రూ. 100లోంచి రూ.4 వేలకుపైగా చేరింది. ఇది సుమారు 4 వేల శాతంపైగా పెరుగుదల అని చెప్పవచ్చు. ఇలాంటి రాబడులు చాలా అరుదుగా ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ కనుగొనడం చాలా కష్టం.

25
NSEలో లిస్టింగ్ – స్టాక్‌కు భారీ గ్రోత్..

ఈ స్టాక్ 5 సంవత్సరాల్లోనే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 4 వేల శాతానికి పైగా లాభాలు అందించింది. NSEలో కూడా లిస్టింగ్ అయిన ఈ స్టాక్.. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొంది.. పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలు ఇచ్చింది.

35
వ్యాపార వృద్ధి, ప్రాజెక్ట్‌లు.. ఇవే ప్రధాన కారణాలు..

నిజానికి ఈ స్టాక్ లాటరీ ఏమి కాదు.. ఈ కంపెనీ తమ వ్యాపారంలో వృద్ది సాధించడమే కాకుండా.. తరచూ పెద్ద ప్రాజెక్టులను దక్కించుకుంది. పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో స్థిరమైన పురోగతిని సాధించింది. ఉత్పత్తి పెరగడంతో.. లాభాలు ఆటోమేటిక్ గా వచ్చాయి. ఇవే స్టాక్ ధరను ఆకాశానికి తీసుకెళ్ళాయి.

45
దీర్ఘకాలిక పెట్టుబడికి ఇదే..

ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్టర్లు భయం లేకుండా చేస్తాయి. ఈ 4 వేల శాతంపైగా వృద్ది ఎలా జరిగిందో ముందుగా తెలుసుకోవాలి. సాధారణ పెట్టుబడులన్నీ ఈ రకమైన లాభాలు తెచ్చిపెట్టవు. కాంట్రాక్ట్‌లు, ప్రాజెక్ట్‌లు, ఫైనాన్షియల్ స్ట్రాటజీ చాలా ముఖ్యం. ఇది ఒక గణనీయమైన గ్రోత్ స్టోరీ. కానీ అన్ని షేర్లు ఇలానే ఉండవు. అందుకే స్టాక్స్ కొనే ముందు ఆ కంపెనీ చిట్టా మొత్తం చూడటం చాలా ముఖ్యం.

55
స్టాక్స్‌లో అడుగు పెట్టే ముందు..

ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. RDB Infrastructure & Power స్టాక్ లా ప్రతీది దొరకదు. అలాగే ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టాలన్నా.. ఇప్పటి పరిస్థితిని చూడాల్సిందే. కంపెనీ ఫలితాలు, ప్రాజెక్టులు లాంటివి ముందుగా చూడాలి. గతంలో సాధించిన విజయాలు మాత్రమే కాదు.. భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్మార్ట్ ప్లాన్, ప్రయోజనాలు లాంటివి చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories