Trump threats: రష్యా నుంచి చమురు కొనుగోలు చేశారో జాగ్రత్త.. మోడీని బెదిరిస్తున్న ట్రంప్

Published : Oct 20, 2025, 09:37 AM IST

రష్యాకు, అమెరికాకు మధ్య పచ్చ గడ్డి ఇస్తే భగ్గుమనేలా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మరింత పన్నులు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారతదేశాన్ని హెచ్చరించారు. దీంతో మోడీ ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

PREV
14
ట్రంప్ వార్నింగ్

మన చమురు అవసరాలను తీర్చేది రష్యానే. రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తున్నాము. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని భారత్ ను బెదిరిస్తూనే ఉన్నారు. లేకుంటే భారీ పన్నులు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మరొక్కసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని హెచ్చరించారు. వెంటనే కొనుగోలు చేయడం ఆపివేయాలని అన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ఆపేస్తామని తమకు హామీ ఇచ్చారని కూడా చెబుతున్నారు.

24
మోడీ మాటిచ్చారు కానీ...

అమెరికాలో విలేకరులతో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ ‘భారత ప్రధాని మోడీ ఇకపై రష్యా నుంచి కొనుగోలు చేయమని హామీ ఇచ్చారు. కానీ ఇంకా అదే పని చేస్తున్నారు. ఇలా అయితే భారీ పన్నులు వేయక తప్పదు’ అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికా భారత దేశానికి చెందిన ఎగుమత్తులపై 50 శాతానికి పైగా పన్నులను విధించింది. దుస్తులు, ఔషధాలపై సుంకాలను విపరీతంగా పెంచింది. ఇప్పుడు చమురు కొనుగోలును ఆపకపోతే మరింత పన్నులను భరించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

34
భారత్ డబ్బుతో ఉక్రెయిన్ యుద్ధం

వైట్ హౌస్ లోని విలేకరులతో మాట్లాడిన ట్రంప్ భారతదేశంలో తన చమురు అవసరాలలో మూడింట ఒక వంతును రష్యానుంచే దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి చమురుని కొనుగోలు చేయడం వల్ల ఆ డబ్బు ఉక్రెయిన్ యుద్ధానికి సహాయపడుతోందని ట్రంప్ చెప్పారు. కాబట్టి రష్యాను ఆర్థికంగా బలహీనంగా చేయాలంటే భారత్ చమురు కొనుగోలును ఆపివేయాలన్నది ట్రంప్ వాదన. రష్యాతో చమురు, గ్యాస్ వ్యాపారం కొనసాగించే దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతూనే ఉంది. చమురు ఆదాయమే రష్యా సైన్యాన్ని శక్తివంతం చేస్తోందన్నది ట్రంప్ చెబుతున్నారు.

44
చమురు రష్యా నుంచే

అయితే రష్యా నుంచి చమురు గ్యాస్ కొనడం వల్ల భారతదేశానికి ఆ అవసరం తీరుతుంది. మూడింట ఒక వంతు అవసరాన్ని రష్యానే తీరుస్తోంది. భారతదేశంలో ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రకటన చేసింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం అనేది రాజకీయపరమైన నిర్ణయం కాదని అది ఇంధన భద్రత అవసరాలపై ఆధారపడి ఉంటుందని చెబుతోంది. అయినా కూడా అమెరికా అధ్యక్షుడు ఏమాత్రం వినిపించుకోవడం లేదు. రష్యాపై మాత్రమే చమురు కొనుగోలుకు ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. భారతదేశం మాత్రం తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ హెచ్చరించడంతో మోడీ ఇలాంటి అడుగు వేయబోతున్నారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories