మొబైల్ పోవడం (Mobile) అనేది ఇప్పుడు ఎంతోమందికి ఎదురవుతున్న సమస్య. అలా ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, బ్లాక్ చేయడానికి ఒక యాప్ ఉంది. ఇది కేంద్రప్రభుత్వానికి చెందినది. పేరు సంచార్ సాథి యాప్.
నేటి ప్రపరంచంలో మొబైల్ పోవడం సహజమైపోయింది. ఒకరితో ఒకరు ఫోన్ లో కనెక్ట్ అయేందుకు మాత్రమే కాదు సోషల్ మీడియా, డబ్బు పంపకాలు, ఆన్ లైన్ షాపింగ్ వంటి వాటికోసం మొబైల్ కచ్చితంగా ఉండాల్సిందే. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు కనిపిస్తారు కొంతమంది. కానీ ఒక్కోసారి మొబైల్ పోతూ ఉంటుంది. మొబైల్ పోవడం అనేది సహజమైన విషయంగా మారిపోయింది.
25
కేంద్రప్రభుత్వ యాప్ ఇదిగో
పోయిన మొబైల్ ను కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 'సంచార్ సాథి' అనే వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ లో మీ ఫోన్లో ఉంటే పోయిన ఫోన్‌ను ఇతరులు వాడకుండా వెంటనే బ్లాక్ చేయొచ్చు. తర్వాత దాన్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోగలరు.
35
ఈ వివరాలు అవసరం
మీ ఫోన్ పోయినప్పుడు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలంటే మీరు కొన్ని వివరాలు ఇవ్వాలి. అందుకే ఫోన్ కొనగానే దాని వివరాలు ఒకచోట రాసుకోవాలి. పోలీసులకు మీ ఫోన్ నెంబర్, IMEI నంబర్, ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రదేశం, మీ వ్యక్తిగత వివరాలు వంటివి ఇవ్వాలి. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా ఈ యాప్‌లో చూడొచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా మీ పేరుతో సిమ్ తీసుకుంటే దాన్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు.
కేంద్రప్రభుత్వానికి చెందిన సంచార్ సాథి యాప్ ఎన్నో ఫోన్లను వెతికి ఇచ్చింది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద కాల్స్, SMS, వాట్సాప్ కాల్స్‌పై కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సాయంతో 5 లక్షలకు పైగా పోయిన ఫోన్లు దొరికాయి. కోటికి పైగా అనధికార కనెక్షన్లు తొలగించారు. ఇంతకన్నా ఈ యాప్ గొప్పతనం గురించి ఏం చెప్పాలి.
55
ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
భారతీయ పౌరుల గురించి తయారు చేసిన ముఖ్యమైన యాప్ ఇది. మీ ఫోన్లో ఇప్పుడే దీన్ని డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం. ఫోన్ ఒకవేళ్ల పోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు.