Interest rates: 1.5 శాతం వడ్డీకే లోన్‌.. నిజంగా అదృష్టమంటే వీళ్లదే.

Published : Feb 10, 2025, 04:46 PM ISTUpdated : Feb 10, 2025, 05:16 PM IST

బ్యాంకులు, లేదా ఆర్థిక సంస్థలు ఏవైనా రుణాలు అందించాలంటే వడ్డీ వసూలు చేస్తాయని తెలిసిందే. అయితే ఆ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వాలు నిర్ణయిస్తుంటాయి. మరి ప్రపంచంలో అత్యంత తక్కువ వడ్డీ రేటు అమల్లో ఉన్న దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
14
Interest rates: 1.5 శాతం వడ్డీకే లోన్‌.. నిజంగా అదృష్టమంటే వీళ్లదే.

తాజాగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్లలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.5శాతం నుంచి 6.25శాతానికి తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యల్ప వడ్డీ రేట్లు అందిస్తున్న దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

24

ఒకప్పుడు రుణాలు పొందడం అంటే పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ గడిచిన 10 ఏళ్లలో లోన్‌ ప్రాసెస్‌ సులభతరంగా మారింది. సామాన్యులు కూడా సులభంగా రుణాలు తీసుకునే అవకాశం లభించింది. మనం ఏ ఉద్దేశంతో రుణం తీసుకుంటున్నామన్న దాని బట్టి వడ్డీ రేటును నిర్ణయిస్తారు. వ్యవసాయ కోసం రుణాలు తీసుకునే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తారు. అలా కాకుండా పర్సనల్‌ లోన్‌, హోమ్‌ లోన్‌ తీసుకుంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేవాల్లో వడ్డీకి సంబంధించి నియమాలు, సబ్సిడీలు వేరువేరుగా ఉన్నాయి. 

34

ఇక వడ్డీ రేట్లు అనేవి ఆయా దేశాల ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం మారుతుంటాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు నామమాత్రంగా వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. 2023 సంవత్సరంలో 83 దేశాలలో సగటు రుణ వడ్డీ రేటు 14.19 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యంత తక్కువ వడ్డీ వసూలు చేసే దేశాల్లో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సగటున 1.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తున్నారు. జపాన్‌లో కూడా అత్యల్పంగా వడ్డీ రేట్లను అందిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేటును 0.5 శాతంగా నిర్ధారించింది. 

44

కాగా ప్రపంచంలో ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తున్న దేశాల్లో జింబావ్వే మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 35 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మొదట్లో ఈ వడ్డీ రేట్లు మరింత ఎక్కువగా ఉండేవి. 

click me!

Recommended Stories