అదే సమయంలో, 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆల్టో K10 ధరను కంపెనీ పెంచింది. ఈ ఫ్యామిలీ కారు ధరను రూ.8,500 నుండి రూ.19,500 వరకు కంపెనీ పెంచింది. ధరల పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. శాతం ప్రకారం చూస్తే, 3.36% పెరుగుదల. ధర పెరిగినప్పటికీ, దేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఆల్టో K10 కొనసాగుతోంది.
టాప్ వేరియంట్ VXI Plus (O)ను పెంచింది. పెరిగిన ధర తర్వాత రూ.5.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.09 లక్షలుగా ఉంది. ఉత్పత్తి ఖర్చు, ద్రవ్యోల్బణం, కొత్త భద్రతా ప్రమాణాలు, సాంకేతిక అప్‌గ్రేడ్‌లను పరిగణనలోకి తీసుకుని ప్రతి సంవత్సరం ఆటోమొబైల్ కంపెనీలు ధరను మార్చుతాయి.