మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ప్రస్తుతం జీతం ఏడాదికి రూ.694 కోట్లు. ఇప్పుడు ఆ జీతం మరింత పెరిగింది. ఈ ఏడాది నాదెళ్ల జీతం మరో 22 శాతం పెరిగింది. ఇప్పుడు ఆయనకు ఎంత జీతం పెరిగిందో అంచనా వేయండి.
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్. దానికి సీఈఓ మన దేశానికి చెందిన సత్య నాదెళ్ల. ఆయన జీతం గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇప్పటికే ప్రపంచంలో అధికంగా జీతం తీసుకుంటున్న వారిలో ఈయన ఒకరు.
25
ప్రస్తుత జీతం ఇది
ప్రస్తుతం సత్య నాదెళ్ల ఏడాదికి సుమారు 694 కోట్లు రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఆయన జీతం 22 శాతం పెంచారు. ఈ పెంపు వల్ల సత్య నాదెళ్ల ఏడాది జీతం రూ.847.31 కోట్లకు చేరింది.
35
అత్యధిక జీతం ఈయనదే
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అత్యధిక జీతం పొందుతున్న సీఈఓల జాబితాలో చేరిపోయారు. ఆయన ఏడాది జీతం రూ.847.31 కోట్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జీతం వైరల్ గా మారింది.
2024తో పోలిస్తే ఇప్పటికి సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగింది. జూలైలో వార్షిక వేతన సవరణ చేసినప్పుడు 18 శాతం పెంపు జరిగింది. 2023-24లో 48 మిలియన్ల జీతం, 2024-25లో 79.1 మిలియన్లకు, ఇప్పుడు 96.5 మిలియన్లకు పెరిగింది.
55
మైక్రోసాప్ట్ షేర్ విలువ రెట్టింపు
గత మూడేళ్లలో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ విపరీతంగా పెరిగింది. దాదాపు రెట్టింపు అయింది. ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్ విలువ, సత్య నాదెళ్ల జీతం కూడా పెరిగాయి.