కొత్తిమీర కోసిన వెంటనే మళ్లీ సమాంతరంగా పంటను పండించుకోవచ్చు. ఇక కొత్తిమీరను కూరగాయలు అమ్మేవారు మీ దగ్గరికే వచ్చి నేరుగా కొనుగోలు చేస్తారు. లేదంటే మీరే స్వయంగా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కో కొత్తిమీర కట్టను రూ. 5కి విక్రయించిన సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్‌లో కొత్తిమీర ధరలు భారీగా పెరుగుతాయి. కాబట్టి ఈ సమయానికి పంట చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించి. పెట్టుబడులు పెడితే మంచిది.