DMart: డీమార్ట్‌లో తక్కువ ధరలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎంఆర్‌పీ ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తారు. అయితే తక్కువ ధరకు విక్రయిస్తున్నా డీమార్ట్ అసలు లాభాలు ఎలా ఆర్జిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
డీమార్ట్ కోక్ లాంటి ప్రముఖ బ్రాండ్లను తక్కువ ధరకు విక్రయిస్తుంది. దీని ఉద్దేశం లాభం కాదు. కస్టమర్‌ను స్టోర్‌లోకి తీసుకురావడమే లక్ష్యం. ఒకసారి లోపలికి వచ్చిన కస్టమర్ నిత్యావసర వస్తువులు, కిరాణా, గృహ అవసరాల సరుకులు కొనుగోలు చేస్తాడు. దీంతో రూ. 40 కోక్ టిక్ కోసం వచ్చిన కస్టమర్‌తో రూ. 2000 కొనుగోలు చేస్తారు.
25
భారీ కొనుగోళ్లు – ధరలపై డీమార్ట్ ఆధిపత్యం
డీమార్ట్ సరుకులను చిన్న మొత్తాల్లో కాకుండా భారీగా కొనుగోలు చేస్తుంది. ఈ భారీ ఆర్డర్ల వల్ల తయారీ కంపెనీలు ప్రత్యేక ధరలు ఇస్తాయి. ఇతర రిటైలర్లకు లభించని రాయితీలు డీమార్ట్‌కు దక్కుతాయి. ఇదే తక్కువ ధరలకు మూల కారణంగా చెప్పొచ్చు.
35
డబ్బులు తర్వాత చెల్లింపు
డీమార్ట్‌లో కస్టమర్ డబ్బు వెంటనే వస్తుంది. కానీ సరుకులు సరఫరా చేసిన కంపెనీలకు చెల్లింపులు కొంత ఆలస్యంగా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో డీమార్ట్ వద్ద పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంటుంది. ఇది వడ్డీ లేని నిధుల్లా పనిచేస్తుంది. ఇదే డీమార్ట్ ఆర్థిక బలం.
డీమార్ట్ స్టోర్లు సాధారణంగా కనిపిస్తాయి. ఖరీదైన డెకరేషన్, అనవసర ప్రచారం, భారీ ప్రకటనలు ఉండవు. ప్రతి రూపాయి ఖర్చును నియంత్రిస్తారు. ఖర్చు తగ్గితే అదే లాభం అవుతుంది. డీమార్ట్ ఇదే విధానాన్ని అవలంబిస్తుంది.
55
సొంత బ్రాండ్లతో స్థిరమైన లాభాలు
డీమార్ట్ సొంత బ్రాండ్లను కూడా విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులపై లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ లాభంతోనే ఇతర ప్రముఖ బ్రాండ్లను తక్కువ ధరలకు అందిస్తుంది. ఈ వ్యూహం వల్ల కస్టమర్ నమ్మకం పెరుగుతుంది. మళ్లీ మళ్లీ షాపింగ్ చేసే అలవాటు ఏర్పడుతుంది. డీమార్ట్ ఒక్కో ఉత్పత్తిపై లాభాన్ని కాకుండా ఒక్కో కస్టమర్‌పై వచ్చే మొత్తం లాభాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. డీమార్ట్ సాధారణ సూపర్‌మార్కెట్ కాదు. స్థిరమైన నగదు ప్రవాహంతో ముందుకు దూసుకెళ్తున్న వ్యాపార మోడల్.