Diwali: క్రాక‌ర్స్ కాల్చేప్పుడు గాయాలైతే రూ. 25 వేలు పొందొచ్చు.! ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్

Published : Oct 16, 2025, 02:11 PM IST

Diwali: ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో ప్ర‌మాదాలు జ‌రిగితే ఆర్థిక భ‌రోసా ఉండేందుకు ఇన్సూరెన్స్ చేయించుకుంటుంటాం. అయితే దీపావ‌ళికి ట‌పాసులు కాల్చే స‌మ‌యంలో జ‌రిగే ప్ర‌మాదాల‌కు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని మీకు తెలుసా.? 

PREV
15
రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్స్యూరెన్స్

దీపావళి దగ్గరపడుతోంది. దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం అన్నీ ఆనందమే కానీ భద్రత కూడా అంతే ముఖ్యం. ఈ సందర్భంలో కుటుంబాలను రక్షించడానికి ఫోన్‌పే సంస్థ మరోసారి తన ‘ఫైర్‌క్రాకర్ ఇన్స్యూరెన్స్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది చాలా తక్కువ ధరలో ఆర్థిక భద్రత కల్పించే పథకం.

25
కేవలం రూ.11కే 25 వేల రూపాయల భద్రత

ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ధర కేవలం రూ.11 (జీఎస్టీ సహా). దీని ద్వారా గరిష్టంగా రూ.25,000 వరకు ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది. ఈ పథకం 11 రోజుల పాటు అమల్లో ఉంటుంది. పాలసీహోల్డర్‌, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు ఒకే ప్లాన్‌లో కవరవుతారు. అక్టోబర్ 12 తర్వాత కొనుగోలు చేసిన పాలసీలు, కొనుగోలు చేసిన తేదీ నుంచి 11 రోజులు చెల్లుబాటు అవుతాయి.

35
ఈ ప్లాన్ కవరేజీలో ఉండే సదుపాయాలు

ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్స్యూరెన్స్ ద్వారా ఈ క్రింది ప్రయోజనాలు లభిస్తాయి:

* 24 గంటలకుపైగా ఆస్పత్రిలో చేరినప్పుడు ఖర్చు భద్రత ల‌భిస్తుంది.

* 24 గంటల లోపు డే కేర్ చికిత్స ఖర్చులు

* ఒక‌వేళ మ‌ర‌ణం సంభ‌విస్తే ప‌రిహారం ల‌భిస్తుంది.

45
ఇన్స్యూరెన్స్ పొందే విధానం

ఈ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం చాలా సులభం. కేవలం ఒక నిమిషంలో ఫోన్‌పే యాప్ ద్వారా పొందవచ్చు.

దీనికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:

* ఇందుకోసం ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి ‘Insurance’ విభాగానికి వెళ్లాలి.

* అనంత‌రం ‘Firecracker Insurance’ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.

* ఆ త‌ర్వాత రూ.11 ప్రీమియంతో రూ.25,000 కవరేజీ ఉన్న ప్లాన్ ఎంచుకోవాలి.

* ఇన్స్యూరర్ వివరాలు, ప్రయోజనాలు పరిశీలించాలి.

* పాలసీహోల్డర్ వివరాలు నింపి ‘Proceed to Pay’ బటన్ నొక్కాలి.

* ఇలా సింపుల్ స్టెప్స్‌తోనే పాలసీ పూర్తవుతుంది.

55
భద్రతతో దీపావళి వేడుక

ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్స్యూరెన్స్‌తో కుటుంబాలు ఇప్పుడు భయపడకుండా బాణాసంచా పేల్చవచ్చు. చిన్న ప్రమాదాలు జరిగినా ఆర్థిక భారం తగ్గుతుంది. కేవలం రూ.11తో వచ్చే ఈ పథకం దీపావళి ఆనందాన్ని భద్రతతో మిళితం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories