Credit Card: ఈ మధ్యకాలంలోక్రెడిట్ కార్డ్ వినియోగం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డ్ పొందడం ఇప్పుడు సులభం అయినప్పటికీ, చాలా మందికి దాని లాభానష్టాలు పూర్తిగా తెలియవు. ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులపై అవగాహన, దాని లాభానష్టాలేంటో తెలుసుకోవాలి.
ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది ఆన్‌లైన్ షాపింగ్, అత్యవసర ఖర్చులు, రివార్డ్ పాయింట్ల కోసం ఉపయోగపడుతుంది. కానీ అజాగ్రత్తగా వాడితే అప్పుల్లో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు తీయడం పెద్ద తప్పు. దీనిపై భారీ వడ్డీ, అదనపు ఛార్జీలు విధిస్తారు. కావున జాగ్రత్తగా వాడాలి.
25
అప్పుల్లో చిక్కుకునే ప్రమాదం
ఒక క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసి, మరో కార్డు బిల్లు తీర్చడం అనేది చాలామంది పాటించే పద్ధతి. కానీ ఇది తాత్కాలికంగా సమస్యను పరిష్కరించినట్టు అనిపించినా, భవిష్యత్‌లో పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసినప్పటి నుంచే 35% నుంచి 45% వరకు అధిక వడ్డీ వర్తిస్తుంది. ఇది ఇంటి లోన్ లేదా వ్యక్తిగత లోన్ వడ్డీలతో (8% - 15%) పోలిస్తే చాలానే ఎక్కువ. ఇలా చేయడం వల్ల అప్పు మీద అప్పు పెరిగి, ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది.
35
ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
క్రెడిట్ కార్డుతో నేరుగా షాపింగ్ చేస్తే 45-50 రోజుల వరకూ వడ్డీ లేని గడువు లభిస్తుంది. కానీ అదే కార్డుతో ATMలో డబ్బులు తీస్తే, వడ్డీ వెంటనే ప్రారంభమవుతుంది. అలాగే 2% - 3% ఫీజు కూడా అదనంగా వేస్తారు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో వ్యక్తిగత లోన్ లేదా బ్యాంకు లోన్ తీసుకోవడం ఉత్తమం.
క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారమే. డబ్బు తీసిన వెంటనే 2% - 3% క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తారు. ఇకపై ప్రతిరోజూ 35% - 45% వరకూ భారీ వడ్డీ కూడా వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని వాడకపోయినా, వడ్డీ చెల్లించాల్సిందే. ఇలా వినియోగించిన మొత్తం కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. సాధారణంగా ఇంటి లోన్, వెహికల్ లోన్, వ్యక్తిగత లోన్లకు 8% - 15% వడ్డీ ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లోనూ క్రెడిట్ కార్డుతో డబ్బులు తీయడం సరికాదనే చెప్పాలి.
55
జాగ్రత్తలు తప్పనిసరి
క్రెడిట్ కార్డు ఉండటం తప్పు కాదు, కానీ జాగ్రత్తగా వాడటం చాలా ముఖ్యం. అత్యవసర ఖర్చులు, షాపింగ్, రివార్డ్స్ కోసం ఉపయోగపడినా, అజాగ్రత్తగా వాడితే అప్పుల్లో పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో నేరుగా డబ్బులు తీయడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే దీనిపై ఎక్కువ వడ్డీ, అదనపు ఛార్జీలు విధిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిత సమయాల్లో క్రెడిట్ కార్డును దూరంగా ఉండాలి. భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకు లోన్లు లేదా అత్యవసర నిధిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.