ఓరియంట్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎకోటెక్ వోల్ట్ BLDC పేరుతో ఓ అధునాతన సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఇన్‌బిల్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉండటం ప్రత్యేకతగా చెప్పొచ్చు. కరెంట్ లేకపోయినా గంటల పాటు ఫ్యాన్ నడుస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ గాలి ఇచ్చేలా దీనిని రూపొందించారు. ఈ ఫ్యాన్‌లో ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ సదుపాయం ఇచ్చారు. సాధారణంగా పవర్ కట్ సమయంలో ఫ్యాన్ పనిచేయాలంటే ఇన్వర్టర్ అవసరం అవుతుంది. కానీ ఈ మోడల్‌లో ఫ్యాన్‌లోనే బ్యాటరీని అమర్చారు. కరెంట్ పోయిన తర్వాత కూడా సుమారు 10 గంటల వరకు ఫ్యాన్ పనిచేసే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. దీంతో వేసవిలో పవర్ కట్ వచ్చినా ఇబ్బంది తగ్గుతుంది.
25
తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ సేవింగ్
ఈ ఫ్యాన్‌లో BLDC (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్) మోటార్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇది సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఫ్యాన్ పవర్ వినియోగం కేవలం 28 వాట్స్ మాత్రమే. కంపెనీ వివరాల ప్రకారం దీని వల్ల సంవత్సరానికి సుమారు రూ.7 వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేసే అవకాశం ఉంది.
35
హై స్పీడ్, మంచి ఎయిర్ డెలివరీ
ఈ ఫ్యాన్ 350 RPM స్పీడ్‌తో పనిచేస్తుంది. అలాగే 230 CMM ఎయిర్ డెలివరీ ఇవ్వగలదు. అంటే గదిలో అన్ని వైపులా చల్లని గాలి వేగంగా చేరుతుంది. 1200 MM స్వీప్ సైజ్ ఉండటంతో మధ్యస్థ, పెద్ద గదులకు కూడా ఇది బాగా సరిపోతుంది.
ఈ ఫ్యాన్‌ను రిమోట్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. ఫ్యాన్ స్పీడ్ మార్చడం, ఆన్/ఆఫ్ చేయడం కోసం స్విచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫ్యాన్‌తో పాటు రిమోట్, బ్యాటరీలు కూడా బాక్స్‌లో అందిస్తారు. దీంతో ఇన్‌స్టాలేషన్ తర్వాత వెంటనే ఉపయోగించుకోవచ్చు.
55
వారంటీ, ఇతర వివరాలు
ఈ ఫ్యాన్‌కు 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీకి 1 సంవత్సరం వారంటీ ఉంటుంది. ఈ ఫ్యాన్‌కు 5 స్టార్ పవర్ రేటింగ్ ఇచ్చారు. వోల్టేజ్ 220-240V ఉంటుంది. పవర్ 28W, స్పీడ్ 350 RPM, ఎయిర్ డెలివరీ 230 CMM, స్వీప్ సైజ్ 1200 MM ఉంటుంది. భారతదేశంలో తయారైన ఈ ఫ్యాన్ లాంచ్ అయినా ఇంకా రిటైల్ స్టోర్‌లో అందుబాటులోకి రాలేదు. త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇక ధర విషయానికొస్తే ఈ ఫ్యాన్ ధర సుమారు రూ. 4500 ఉండొచ్చని అంచనా.