Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?

Published : May 12, 2026, 01:46 PM IST

Gold: ప్రధాని మోడీ.. బంగారం రేటు అతిగా పెరిగిపోవడంతో కొనడం తగ్గించాలని ప్రజలకు సలహా ఇచ్చారు. ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుందో తెలుసా? బంగారు మార్కెట్ పై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారో తెలుసుకోండి? 

PREV
14
బంగారం కొనొద్దని చెప్పిన మోడీ

బంగారం కొనవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపరీతంగా బంగారం ధరలు పెరుగుతున్న కాలంలో దాన్ని కొనడం వల్ల ఉపయోగం లేదని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టు ఈరోజు నుంచి ఏడాది కాలం పాటు భారతీయులు బంగారం కొనకపోయినా లేదా అతి తక్కువగా కొనుగోలు చేసినా.. మన దేశంలో వందల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఇది నిజమే కానీ నాణానికి మరోవైపు కూడా ఉంది. మనం బంగారం కొనకపోవడం వల్ల ఒక వర్గం ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతారు. వారే దేశంలోని నగల వ్యాపారులు, స్వర్ణకారులు, బంగారు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు. మరి వీరి పరిస్థితి ఏమిటి?

24
ఎంతమంది బంగారంపై ఆధారపడ్డారు?

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతదేశంలో ఐదు లక్షల మంది ఆరు లక్షల వరకు చిన్న పెద్ద నగల వ్యాపారులు జీవిస్తున్నారు వీరిలో పెద్ద కార్పొరేట్ బ్రాండెడ్ నుండి వీధి మూలలో ఉండే చిన్న నగల వ్యాపారి వరకు అందరూ ఉంటారు అంటే ఐదు లక్షల మంది ప్రజలు ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు వీరిలో షోరూం యజమాని కుటుంబం నుండి డిజైన్లు రూపొందించడానికి బంగారాన్ని కలిగించే కళాకారులు, బంగారాన్ని పాలిష్ చేసేవారు హాల్ మార్కింగ్ కేంద్రాల్లో పని చేసేవారు కూడా వస్తారు ఇప్పుడు ప్రధాన మంత్రి బంగారం కొనవద్దని చెప్పడంతో మార్కెట్ పరిస్థితి ఏమవుతుందో అని ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలు ఏమవుతాయని ఆందోళన మొదలైంది

34
నిరుద్యోగులుగా మారవచ్చు

బంగారు ఆభరణాల కొనుగోలు తీవ్రంగా తగ్గిపోతే డిమాండు ఆగిపోతుంది దీని ఫలితంగా బంగారు ఆభరణాల చేసే కళాకారులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది పెద్ద ఆభరణాల వ్యాపారులు ఈ నష్టాన్ని తట్టుకోవడానికి తమ ఉద్యోగులను తొలగించవచ్చు ఇక చిన్న వ్యాపారులు దుకాణం వస్తే ఉద్యోగుల జీతాలు చెల్లించలేక ఇబ్బంది పడతారు చాలామంది పని లేక రోడ్డున పడే అవకాశం ఉంటుంది అంటే దేశంలో దాదాపు 5 లక్షల కుటుంబాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది

44
ఇలా కూడా చేయవచ్చు

దీనికి మరొక మార్గం వద్దనే చెప్పుకోవచ్చు నగల వ్యాపారులు కొత్త బంగారం కొనడానికి బదులుగా తమ పాత బంగారు ఆభరణాలను కొత్తగా మార్చుకునేలా ప్రోత్సహించాలి అలాగే వారు అధికంగా తీసుకుని రుసుములను తగ్గించుకోవాలి అప్పుడు ప్రజలు పాత బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారు వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టికి చూపిస్తారు ప్రస్తుతం పాత బంగారాన్ని ఇచ్చినా కూడా అధిక మొత్తంలో తిరిగి డబ్బు చెల్లించి రావడంతో ఎంతోమంది ఆ పాత బంగారాన్ని వాడుకుంటున్నారు నగల వ్యాపారులు తమ ఫీజును తగ్గించుకుంటే బంగారు మార్కెట్ మళ్లీ సాధారణంగా నిలబడే అవకాశం ఉంటుంది

Read more Photos on
click me!

Recommended Stories