fans, AC Usage ఫ్యాన్లు, ఏసీలు వాడితే.. ఎన్ని యూనిట్లు ఖర్చవుతుంది? ఎంత బిల్లు వస్తుంది??

ఈ వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు వాడకపోతే చాలామందికి భరించడం చాలా కష్టం.  చాలా ఇళ్లలో ఫ్యాన్, ఏసీలు 24 గంటలు వాడుతూనే ఉంటారు. అదే సమయంలో వచ్చే కరెంటు బిల్లు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అసలు ఇంతకు మన ఇంట్లో ఏసీ, ఫ్యాన్ ఎంతసేపు వాడితే ఎన్ని యూనిట్లు ఖర్చవుతుందో ముందు తెలుసుకుందాం. దానికి అనుగుణంగా వాడితే..  కరెంటు ఆదా చేసి డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు.

Calculate AC and fan electricity usage to lower summer bills in telugu

ఫ్యాన్, ఏసీ లేదా ఇతర ఇతర ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా మీరు వాడే పవర్ రేటింగ్ వాట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగానే కరెంటు ఖర్చు మారుతుంది. ఉదాహరణకు, మీరు వాడే ఫ్యాన్ పవర్ రేటింగ్ 75W - 100W మధ్యలో ఉందనుకుందాం. దానికి అనుగుణంగానే బిల్లులు ఉంటాయి.

Calculate AC and fan electricity usage to lower summer bills in telugu

ఈ రోజుల్లో అందరూ హైస్పీడ్ ఫ్యాన్స్ కొంటున్నారు. వాటి వాట్స్ 100W వరకు ఉంటాయి. ఫ్యాన్ పవర్ రేటింగ్ 75W - 100W అయితే, 100W ఫ్యాన్ గంటకు 100W కరెంటు ఖర్చు చేస్తుంది. అంటే, ఒక కిలోవాట్-గంట (kWh) = 1000 వాట్స్ కి సమానం. 


ఇప్పుడు 100W ఫ్యాన్ 10 గంటలు నడిస్తే ఒక యూనిట్ కరెంటు ఖర్చవుతుంది. గంటకు 100W ఫ్యాన్ = 0.1 యూనిట్లు, ఇలా 24 గంటలకు = 0.1 * 24 = 2.4 యూనిట్లు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఒక ఫ్యాన్ తో నెలకు 72 యూనిట్ల వరకు కరెంటు ఖర్చవ్వచ్చు.

ఇంట్లో ఏసీ విషయానికి వస్తే, పవర్ రేటింగ్ 1.5kW నుంచి 2kW వరకు ఉంటుంది. ఏసీ సాధారణంగా 24°C వద్ద స్టార్ట్ అవుతుంది. సాధారణంగా వాడే ఏసీలు 1.5kW - 2kW కరెంటు వాడుకుంటాయి. 

కొన్ని సందర్భాల్లో ఏసీ మోడల్, సామర్థ్యంపై ఆధారపడి వాడకం మారుతుంది. ఏసీ కరెంటు వాడకం: 1.5kW ఏసీ గంటకు 1.5 యూనిట్లు ఖర్చు చేస్తుంది. ఇలా 24 గంటలకు = 1.5 * 24 = 36 యూనిట్ల వరకు ఖర్చవుతుంది.

ఇంతసేపు యూనిట్ల లెక్క తెలుసుకున్నారు, ఇప్పుడు ఈ యూనిట్లకు కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసుకుందాం. యూనిట్ ధర ప్రాంతాన్ని బట్టి మారుతుంది. పట్టణాల్లో ఒకలా, గ్రామాల్లో ఒకలా యూనిట్ ధర ఉంటుంది. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ.5 అయితే, ఫ్యాన్ ఒక రోజు అంటే 24 గంటలు నడిస్తే 2.4 యూనిట్లు, దీని ఖర్చు రూ.12.

ఏసీ ఒక రోజుకు 36 యూనిట్లు నడిస్తే రూ.180 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఏసీ, ఫ్యాన్ హైస్పీడ్‌లో వాడితే రోజుకు రూ.192 వరకు ఖర్చవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. దీనికనుగుణంగా ఎలా పొదుపుగా వాడుకోవాలో మీ చేతుల్లోనే ఉంటుంది.

Latest Videos

vuukle one pixel image
click me!