వడ్డీ రేట్ల పరిస్థితి ప్రభావం
ఆర్బీఐ 2025 ప్రారంభంలో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించింది. జూన్, ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని SBI రీసెర్చ్ అంచనా వేస్తోంది. ఇది బాండ్ మార్కెట్‌కు అనుకూల వాతావరణం.
స్టాక్స్ vs బాండ్లు - ఫండమెంటల్ తేడాలు ఏమిటి?
స్వంతాధికార హక్కు: స్టాక్స్ కంపెనీలో భాగస్వామ్యం ఇస్తే, బాండ్లు అప్పుగా మారుతాయి.
ఆదాయం ఎలా వస్తుంది: బాండ్లు స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని ఇస్తాయి (ఉదాహరణకు, జనవరి 31, 2025 నాటికి 10-ఏళ్ల కార్పొరేట్ బాండ్‌లు సగటు 7.18% లాభాన్నిఅందించాయి), స్టాక్స్ డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్లు (మూలధన లాభాలు) ఇస్తాయి.
రిస్క్ - రిటర్న్: AAA బాండ్లు తక్కువ రిస్క్‌తో 7%-8% లాభాలు ఇస్తే, లోయర్ రేటెడ్ బాండ్లు (క్రెడిట్ రిస్క్ ఎక్కువగా ఉండే బాండ్లు) 13%-14% వరకు లాభాలు ఇస్తాయి. స్టాక్స్ అధిక వాలాటిలిటీతో కూడి ఉన్నప్పటికీ అధిక లాభాల ఛాన్సులు ఉంటాయి.