Business Ideas: నెలకు రూ. 1 లక్ష సంపాదించడమే మీ లక్ష్యమా, చదువు లేకపోయినా పర్లేదు.. ఈ బిజినెస్ చేస్తే చాలు..

First Published Dec 28, 2022, 11:54 PM IST

తక్కువ పెట్టుబడి తో స్టార్ట్ చేయగలిగే ఓ చక్కటి బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఒక రోజుకు 5 వేల రూపాయలు పెట్టుబడి పెడితే  చాలు నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించవచ్చు. ఎలాగంటే, 5 వేల రూపాయల రా మెటీరియల్ కోసం పెట్టుబడి పెట్టి  ఈ బిజినెస్ మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు.

ఈ బిజినెస్ ఐడియా ఏంటంటే సాఫ్ట్ స్క్రబ్బర్ ప్యాడ్స్, సాధారణంగా ఇళ్లల్లో గిన్నెలను తోమేందుకు  steel scrubber వాడుతుంటారు. కానీ వాటి ద్వారా చేతులకు గాయాలు అవుతుంటాయి. అందుకే ఈ సాఫ్ట్ స్క్రబ్బర్ ప్యాడ్స్ ను మహిళలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో  వాడుతున్నారు.  ఇవి మార్కెట్లో అనేక బ్రాండ్ల రూపంలో అవైలబుల్ గా ఉన్నాయి వీటికి మంచి డిమాండ్ ఉంది. 
 

మార్కెట్లో మీరు గమనించాల్సిన ఓ విషయం ఏంటంటే ఏ బిజినెస్ అయినా ఫ్రాఫిట్ మార్జిన్ ఐదు శాతం నుంచి  30 శాతం వరకు ఉంటుంది.  అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ వంద రూపాయలు ఉంటే దానిని మార్కెట్లో 130 రూపాయలు విక్రయిస్తే మీకు సుమారు 30 శాతం లాభం వస్తుంది. కానీ ఈ సాఫ్ట్ స్క్రబ్బర్ విషయంలో లాభం మార్జిన్ 70 శాతం వరకూ ఉంటుంది. 
 

స్క్రబ్బర్ తయారీకి ఒక రూపాయి 40 పైసలు ఖర్చు అవుతుంది. కరెంటు, ప్యాకింగ్, రవాణా అంతా కలిపి మనకు 3 రూపాయలు అవుతుంది  అయితే ఒక స్క్రబ్బర్ ప్యాడ్ ధర  మార్కెట్లో ధర పది రూపాయలు ఉంది.  కానీ సాధారణంగా మనమేం చేస్తాం అంటే మూడు రూపాయలకి రెండు రూపాయలు ప్రాఫిట్ వేసుకొని ఐదు రూపాయలు అంటే  రెండు రూపాయలు లాభంతో హోల్ సేల్ మార్కెట్లో విక్రయిస్తాం. 
 

ఇలా కాకుండా డైరెక్టుగా నాలుగు రూపాయలు ప్రాఫిట్ వేసుకుని 7 రూపాయలకి రిటైలర్లకు అమ్మవచ్చు. ఇక స్క్రబ్బర్స్ తయారు చేసే ఆటోమేటిక్ మిషన్ ధర కేవలం రూ. లక్ష యాభై వేలకి లభిస్తుంది. ఇక ఓ తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మీరు రా మెటీరియల్ కోసం సప్లయర్ల నుంచి కాంట్రాక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సీలింగ్ మెషీన్ కూడా కొనుగోలు చేసుకోవాలి. అప్పుడే మీ స్క్రబ్బర్లను ప్యాక్ చేయగలరు. 

స్క్రబ్బర్ ప్యాడ్లను జాగ్రత్తగా మార్కటింగ్ చేసుకోవడం ద్వారా మీరు నేరుగా రిటైలర్లకు వీటిని విక్రయించవచ్చు. అప్పుడు మీకు అనుకున్న లాభం  లభిస్తుంది. మార్కెట్లో సాధారణంగా స్క్రబ్బర్లను రూ.12 లకు విక్రయిస్తున్నారు. మీకు దాదాపు ఒక్క స్క్రబ్బర్ పైనా 4 రూపాయల లాభం లభిస్తుంది. అంటే రూ. 3 పెట్టుబడి మీద మీకు రూ.7 లభిస్తోంది. ఈ లెక్కన మీరు పొందే లాభం దాదాపు 50 శాతం కన్నా ఎక్కువే  
 

click me!