Business Ideas: మహిళలు ఇంటివద్దే సులభంగా చేయగలిగే బిజినెస్ ఇదే, నెలకు అరలక్ష వెనకేసుకునే అవకాశం..

Published : Dec 28, 2022, 02:48 PM IST

మహిళలు ఇంటి వద్ద ఉండే డబ్బు సంపాదించాలని ఆలోచన చేస్తున్నారా,  పెరుగుతున్న ఖర్చులకు   తగినట్టుగా  మీ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారా. అయితే మహిళలు సులభంగా చేయగలిగే, ఒక కొత్త బిజినెస్ ప్లాన్ తో  మీ ముందుకు వచ్చాం. దీని ద్వారా ఇంటి వద్ద ఉంటూనే చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. 

PREV
16
Business Ideas: మహిళలు ఇంటివద్దే సులభంగా చేయగలిగే బిజినెస్ ఇదే, నెలకు అరలక్ష వెనకేసుకునే అవకాశం..

సాధారణంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారంలో ముందుకు సాగవచ్చు.  అలా రోజుకు మూడు గంటలు కష్టపడితే చాలు సులభంగా డబ్బు సంపాదించ గలిగే, అనేక వ్యాపారాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే బేబీ కేర్ సెంటర్.  మీ ఇంట్లోనే ఓ గదిలో,  బేబీ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం ద్వారా మీరు మీ ఖాళీ సమయంలో  డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. 
 

26

సాధారణంగా భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులు అయినట్లయితే, చంటి పిల్లలను చూసుకోవడం  చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు పిల్లలను చూసేందుకు బేబీ కేర్ సెంటర్ ఆశ్రయిస్తారు.  దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. మీరు కూడా ఓపెన్ చేయడం ద్వారా  ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. మీ  ఇంట్లోనే ఓ గదిని  ఏర్పాటు చేసుకుంటే మంచిది.  గాలి వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి.

36

సాధారణంగా నెలల పిల్లల నుంచి,  మూడేళ్ల పిల్లల వరకు  బేబీ కేర్ సెంటర్ లో ఉంచుతారు. వీరిని వారి తల్లిదండ్రులు ఆఫీసుల నుంచి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు వారు డబ్బు చెల్లిస్తారు.  అయితే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే బేబీ కేర్ కోర్సులను  చేయాల్సి ఉంటుంది. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మంచిది. 

46

ఇక బేబీ కేర్ సెంటర్ కోసం మీరు ఏర్పాటు చేసుకున్న గదిలో  బొమ్మలు, బేబీ సీట్ టాయిలెట్స్, కొన్ని ఉయ్యాలలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పిల్లలకు ఆట పాట నేర్పేందుకు ఎల్ఈడీ టీవీ కూడా పెట్టుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు పెట్టమని చెప్పిన ఆహారాలను జాగ్రత్తగా నోట్ చేసుకొని,  వారికి తినిపించాల్సి ఉంటుంది.  అలాగే  అత్యవసర పరిస్థితులలో తల్లిదండ్రులను కాంటాక్ట్ చేసేందుకు  లాండ్ లైన్ ఫోన్,  అలాగే సెల్ ఫోన్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.  ఎమర్జెన్సీ నెంబర్లను  దగ్గర పెట్టుకోవాలి.  అందులో డాక్టర్లు,  పోలీసు స్టేషన్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి. 
 

56

బేబీ కేర్ సెంటర్లో పిల్లలకు అపాయం కలిగించే,  పదునైన వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు గదిలో ఉంచరాదు. పిల్లలకు తెలియకుండా వీటితో ఆడుకుంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది.  బేబీ కేర్ సెంటర్ లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు సూచన మేరకే వారికి ఆహారం తినిపించాల్సి ఉంటుంది.
 

66

అదేవిధంగా బేబీ కేర్ సెంటర్ లో,  మీకు సహాయం కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే మంచిది.  తల్లిదండ్రులు సూచించిన అత్యవసర మందులను  వారి వద్ద నుంచి తీసుకొని మీ వద్ద పెట్టుకుంటే మంచిది. అలాగే గదిని ప్రతినిత్యం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా,  పిల్లలకు జబ్బులు రాకుండా ఉంటాయి.  
 

Read more Photos on
click me!

Recommended Stories