Business Ideas: ఊరు కదలకుండానే, నెలకు రూ. 1 లక్ష సంపాదించాలంటే, ఏం చేయాలో తెలుసుకోండి..?

First Published Dec 28, 2022, 11:00 PM IST

మీరు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించడం లేదని బాధపడుతున్నారా, పట్టణాల్లో ఉంటూ  అద్దెలు చెల్లిస్తూ, డబ్బంతా వృధా చేసుకుంటున్నారా, అయితే మీరు ఉన్న గ్రామంలోనే,  కాస్త వ్యవసాయ భూమి ఉంటే చాలు నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  అది ఎలాగో తెలుసుకుందాం. 

cabbage

కూరగాయల సాగు అనేది చాలా మంది, చేస్తూనే ఉంటారు.  నిజానికి కూరగాయల సాగులో చాలా లాభం ఉంటుంది.  సరిగా నిర్వహణ చేసుకుంటే ప్రతిరోజూ కూరగాయల సాగు ద్వారా లాభం పొందవచ్చు.  ప్రస్తుతం క్యాబేజీ సాగు చేయడం ద్వారా ఎలా లాభం పొందవచ్చు తెలుసుకుందాం. 

Image: Getty Images

కూరగాయల్లో క్యాబేజీని అనేది ఎక్కువగా,  చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్లు  వాడుతుంటారు.  క్యాబేజీ లేకుండా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వంటకాలు ఉండవు.  మంచూరియా,  నూడిల్స్, సూప్స్, సలాడ్స్ ఇలా అనేక రకాలుగా  క్యాబేజీని వాడుతుంటారు. మీరు కూడా క్యాబేజీని సాగు చేసి,  చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సప్లై చేయడం ద్వారా , చక్కటి ఆదాయం పొందే వీలుంది. 
 

purple cabbage

మీకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే,  క్యాబేజీ గింజలతో నారు తయారు చేసుకొని,  క్యాబేజీ పంటలను వేసుకోవచ్చు. కేవలం ఒక ఎకరం లోనే సుమారు 30 నుంచి 40 టన్నుల క్యాబేజీని పండించవచ్చు.   దీని పంట కాలం కూడా కేవలం 50 నుంచి 60 రోజులు మాత్రమే.  మీరు వీటిని హోల్సేల్ గా మార్కెట్లో విక్రయించే కన్నా, నేరుగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు  మార్కెట్ ధరకే విక్రయిస్తే, ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. 

క్యాబేజీలు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వాళ్ళు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. అలాగే వీరి వద్ద నుంచి ఆర్డర్ లు సైతం నిరంతరం వస్తూ ఉంటాయి. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. క్యాబేజీ పంటకు నీరు ఎక్కువ అవసరం, కనుక డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే చాలా మంచిది.  డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని వృధా ఎక్కువగా ఉండదు. నీటి వృథాను అరికట్టవచ్చు. క్యాబేజీ చలికాలంలో ఎక్కువగా పండుతుంది. మిగతా సీజన్లలో కూడా పండుతుంది. కానీ  కీటకాలు, పురుగులు సోకకుండా  వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో మందులను వాడుతూ ఉండాలి. 

cabbage

అలాగే క్యాబేజీలను ఆఫ్ సీజన్లో తక్కువ మొత్తంలో నీరు సరిపడేలా పెంచుకోవాలి. అప్పుడు మీ క్లయింట్లకు క్యాబేజీలను సరఫరా చేసే వీలుంటుంది.  క్యాబేజీ లను స్టోర్ చేసుకునేందుకు,  ఏసీ గదులను కూడా  సిద్ధం చేసుకుంటే మంచిది.  అధికంగా క్యాబేజీలు ఉత్పత్తి అయినప్పుడు, వాటిని  కొద్ది రోజుల పాటు నిల్వ చేసి,  విక్రయించుకునే వీలుంటుంది. 

క్యాబేజీలకు డిమాండ్ దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది.  ఎందుకంటే వీటిని అన్ని రెస్టారెంట్లు,  చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు,  విరివిగా వాడుతుంటారు.  క్యాబేజీ లను మార్కెట్ కు చేరవేసేందుకు.  ఓ కమర్షియల్ ట్రక్ మెయిన్ టెయిన్  చేస్తే మంచిది.  అప్పుడు మీ క్లయింట్ల వద్దకు  సులభంగా క్యాబేజీలను చేరవేయవచ్చు. 

click me!