Business Ideas: ఏ చదువు లేకపోయినా ప్రాబ్లం లేదు, నెలకు రూ. 1 లక్ష సంపాదించి పెట్టే ఫుల్ డిమాండ్ బిజినెస్ ఇదే..

First Published Jan 18, 2023, 11:17 PM IST

మిత్రులారా బిజినెస్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారా అయితే నగరంలో చాలా డిమాండ్ ఉండే ఓ బిజినెస్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. . ఈ బిజినెస్ కు సంవత్సరంలో 365 రోజుల పాటు అలా డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు.  మీరు కూడా ఈ బిజినెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే అదేమీ  వ్యాపారమో తెలుసుకుందాం. 

Laundry and Dry Cleaning Business

దుస్తుల డ్రై క్లీనింగ్ అనేది చాలా డిమాండ్ ఉన్న బిజినెస్.  సాధారణంగా లాండ్రీ కన్నా కూడా డ్రై వాష్ చేసే వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది అంతేకాదు.  డ్రై క్లీనింగ్ కు ఛార్జ్ చేసే సర్వీసు కాస్ట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి.  ఎంత ధర పెట్టినప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు.  అంతేకాదు డ్రై క్లీనింగ్  రంగంలో ఉన్నవారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు.  ఉదాహరణకు ఒక పట్టు చీర డ్రై క్లీనింగ్ చేయాలంటే సుమారు 250 రూపాయల వరకు చార్జ్ చేస్తారు.  అంతేకాదు డ్రైవాష్ చేసేందుకు కనీసం పది రోజులపాటు వెయిటింగ్ టైం ఉంటుంది.  అంటే ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. 
 

 పెళ్లిళ్ల సీజన్లో అయితే ఇక చెప్పక్కర్లేదు కనీసం ఒక పట్టు చీరను డ్రై వాష్ చేసేందుకు నెలరోజుల వరకు సమయం పడుతుంది దీనిబట్టి ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.  డ్రై వాష్ ద్వారా ఎక్కువగా పట్టు అలాగే ఇతర విలువైన వస్త్రాలకు ఎక్కువగా చేస్తూ ఉంటారు.  నిజానికి డ్రై వాష్ ద్వారా దుస్తులను వాష్ చేయిస్తే అవి కొత్త వాటిలా మారిపోతాయని పేరుంది. అలాగే పట్టు చీరలను నీటిలో ఉతికితే,  అవి పాడైపోయే అవకాశం ఉంది.  కనుక డ్రైవర్ చేయడం ద్వారా మీరు పట్టులోని మృదుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. 

Money image

 ఇక మీరు డ్రైవాష్ సెంటర్ ఓపెన్ చేయాలి అనుకుంటే, కాలనీల్లో ఓ షాపును అద్దకు తీసుకుంటే మంచిది. లేదా మీ ఇంటి ముందే డ్రై వాష్ చేయబడును అని బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది.  అయితే కమర్షియల్ గా సక్సెస్ అయ్యేందుకు షాపు తీసుకొని వ్యాపారం చేస్తే ఎక్కువ ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. 

 డ్రై వాష్ సెంటర్ పెట్టుబడి కింద సుమారు 5 లక్షల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక డ్రై వాష్ ఎలా చేయాలో తెలుసుకునేందుకు శిక్షణ పొందాల్సి ఉంటుంది.  స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో డ్రై వాష్ సెంటర్ల నిర్వహణ ఎలాగో తెలుసుకోవచ్చు. 
 

ఇక ఆదాయం విషయానికొస్తేడ్రై వాష్ సెంటర్ ద్వారా ప్రతి రోజు కనీసం  ఐదువేల వరకు సంపాదించిన అవకాశం ఉంది.  ఈ లెక్కన ప్రతినెల  ఒక లక్ష కన్నా ఎక్కువ సంపాదించే వీలుంది.  మీరు కూడా డ్రై వాష్ సెంటర్ పెట్టాలనుకుంటే,  పూర్తి వివరాలను తెలుసుకొని మార్కెట్ అధ్యయనం చేసే ఈ రంగంలోకి దిగితే మంచిది.  

click me!