Business Ideas: కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రతి నెల ఇంటి వద్దే లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం..ఎలాగంటే..

First Published Jan 18, 2023, 1:51 AM IST

యువతీ యువకులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేందుకే సమయం   ఖర్చు పెడుతున్నారు.  అయితే సోషల్ మీడియా ద్వారా డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది.  అది ఎలాగో ప్రస్తుతం మనం తెలుసుకుందాం తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

 ప్రస్తుత కాలం సోషల్ మీడియా చాలా విస్తృతంగా  విస్టారిస్తోంది.  మహా నగరాల నుంచి పల్లెటూర్ల వరకు సోషల్ మీడియా విస్తరించింది.  స్మార్ట్ ఫోన్ కల్చర్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జనం తమ సమయాన్ని యూట్యూబ్,  ఫేస్  బుక్,  ఇన్ స్టాగ్రామ్,  ట్విట్టర్ వంటి వీడియోలను చూసేందుకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.  మీరు కూడా వీడియోలను చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

అయితే కేవలం వీడియోలు చేయడం ద్వారా డబ్బు మాత్రమే కాదు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి బ్రాండింగ్ చేయడం ద్వారా మరింత అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.  ఉదాహరణకు మీరు చేసే వీడియోలు వైరల్ అవ్వడం ద్వారా మీకు మంచి పేరు లభించే అవకాశం ఉంది.  దాని నుండి మీరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి డబ్బు సంపాదించే అవకాశం ఉంది.  పలు బ్రాండ్లు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లతో  తమ ఉత్పత్తులను  అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.  తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

పలువురు సాధారణ  గృహిణులు సైతం సోషల్ మీడియాను ఉపయోగించి తమ వీడియోలు వైరల్ అవడం ద్వారా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.  అలాంటివారు ప్రస్తుతం మన దేశంలో చాలామందిని చూడవచ్చు.  అయితే మీరు సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.  యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ ద్వారా మీరు ఆదాయం పొందవచ్చు. అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి కూడా పలు ప్రాడెక్టులకు బ్రాండింగ్ చేసి డబ్బు సంపాదించే అవకాశం ఉంది

అలాగే సోషల్ మీడియాలో కొన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది.  వాటి విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా మందులు,  రసాయనాలు,  ఆన్లైన్ జూదం, క్రిప్టో కరెన్సీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.  మీరు ప్రమోట్ చేసిన బ్రాండ్  చట్ట విరుద్ధమైనది అని తేలితే మీ  మీద కేసులు సైతం నమోదు చేసే అవకాశం ఉంది.  కావున మీరు ప్రమోట్ చేసే బ్రాండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది.    
 

click me!