Business Ideas: ప్రతి నెల రూ. 1 లక్ష సంపాదించడమే మీ టార్గెట్టా...అయితే ఈ బిజినెస్ చేస్తే సరిపోతుంది..

First Published Jan 18, 2023, 12:58 AM IST

ఉద్యోగంలో లభించడం లేదని ఆందోళన చెందుతున్నారా అయితే ఇక ఏమాత్రం ఆందోళన చెందవద్దు.  ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ అప్లై చేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

ప్రస్తుతం కరోనాకాలం ముగిసిపోయింది.  దీంతో విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు ఆఫీసులో కార్పొరేట్ సంస్థలో అన్ని తెరుచుకున్నాయి.  ముఖ్యంగా నగరాలకు చేరుకొని ఉద్యోగం చేయాల్సిన యువత మళ్లీ తమ జీవనస్థితిగతులను ట్రాక్ ఎక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరాల్లో జీవించాలంటే కచ్చితంగా అద్దె ఇళ్లను ఆశ్రయించాల్సి ఉంటుంది అయితే అంత మొత్తంలో చెల్లించుకోలేనివారు హాస్టల్ లను ఆశ్రయిస్తుంటారు.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 

వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ హాస్టల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా  వర్ధిల్లుతోంది. చదువుకునే విద్యార్థులు ఉద్యోగం చేసుకునే యువతీ యువకులు ఎక్కువగా ఈ హాస్టల్లోనే నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోటీ పరీక్షలు ఇలాంటి సమయంలో నగరంలో ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ సెంటర్లలో చేరేందుకు వచ్చిన యువత ఈ హాస్టళ్లలోనే  ఉండేందుకు ఎక్కువగా  అనువుగా ఉంటుంది. 

ఇక మీరు కూడా పీజీ హాస్టల్ తెరవాలి అనుకుంటే,  ముందుగా మంచి కమర్షియల్ ప్రదేశంలో విద్యాసంస్థలు ఆఫీసులు అందుబాటులో ఉండే ప్రదేశంలో,  ఎక్కువ గదినుండే అపార్ట్మెంట్ లేదా బిల్డింగ్ రెంటుకు తీసుకోవాలి. అందులో గదుల్లో బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఒక్కో గదిని  బ్యాచిలర్లకు కేటాయించుకోవచ్చు. 
 

పీజీ హాస్టల్లో మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే మెస్ పెట్టుకోవడం చాలా అవసరం అప్పుడే మీరు సక్సెస్ అవుతారు.  మెస్సులో ఉదయం బ్రేక్ ఫాస్ట్,  మధ్యాహ్నం రాత్రి భోజనం అందుబాటులో ఉంచాలి. . అప్పుడే బ్యాచిలర్లు హాస్టల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతారు.  ప్రతి గదిలోనూ ఫ్యాన్లు లైట్లు అందుబాటులో ఉంచాలి. అవసరమైతే జనరేటర్ కూడా అందుబాటులో ఉంచితే మంచిది. . ఇక ఇంటర్నెట్ వైఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంచితే మేలు. 
 

ఉమెన్స్ హాస్టల్ నిర్వహించే సమయంలో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.  ప్రత్యేకంగా ఉమెన్స్ హాస్టల్స్ లో భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

ఇక హాస్టల్ లో చేరే వారి  పూర్తి వివరాలను మీరు సేకరించాల్సి ఉంటుంది. ఫోటో ఐడి కార్డు వారు పనిచేసే లేదా చదువుకునే కాలేజీ అడ్రస్సులను మీ వద్ద పొందుపరచుకోవాలి.  ఫోన్ నెంబర్లు కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది. అడ్రస్  ప్రూఫ్లను కూడా మీ వద్ద రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తే మంచిది. 

ఇక మెస్ నిర్వహణలో నాణ్యత చాలా అవసరం.  నాణ్యమైన భోజనం బ్యాచులర్లకు అందుబాటులో ఉంచితే మీకు నిరంతరం నిర్వహణ చేసే అవకాశం దక్కుతుంది.  అదేవిధంగా మెస్సు నిర్వహణలో ముఖ్యమైనది.  పని వాళ్ళను మెయింటైన్ చేయడం పని వాళ్లు రాని సమయంలో మీరే అన్ని పనులు చేసుకునేలా ఉండాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. 
 

click me!