మహిళలు కొంతమంది గ్రూప్ గా చేరి, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే మీరు క్యాటరింగ్ సర్వీసులు, మెస్సులు హోటళ్లను నేరుగా సంప్రదించి మార్కెట్ ధర కంటే కొద్దిగా తక్కువకే ప్లేట్లను సప్లై చేస్తామంటే మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే పేపర్ ప్లేట్ల విషయంలో మెషిన్ మెయింటెనెన్స్ చాలా అవసరం. విద్యుత్ బిల్లులు ఎక్కువగా రాకుండా ఉండేందుకు మిషన్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి చిన్న చిన్న రిపేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంట వెంటనే రిపేర్లు చేయిస్తూ ఉండాలి అప్పుడే మీరు పెద్ద మొత్తంలో నష్టపోకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.