Business Ideas: ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు, రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే చాలు, నెలకు లక్షల్లో ఆదాయం సంపాదన..

First Published Jan 16, 2023, 11:47 PM IST

ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ అనేది బాగా విస్తరిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్స్ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఫుడ్ బిజినెస్ బాగా విస్తరించింది. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో ఫుడ్ బిజినెస్ కు మంచి గిరాకీ ఉంది. ఎందుకంటే పెరుగుతున్న బిజీ లైఫ్ స్టైల్ లో ఇంటి వద్ద వండుకొని తినడం అనేది తగ్గిపోతోంది. ముఖ్యంగా మంచి మంచి రుచులను చూడాలంటే హోటళ్లకు వెళ్లాల్సిందే అయితే ఇంటి వద్ద ఉంటూనే చక్కటి ఫుడ్ తినాలనుకునే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ చక్కటి అవకాశం అనేది చెప్పాలి. 

ఫుడ్ డెలివరీ ఆప్స్ వచ్చినప్పటి నుంచి హోటల్ తో పనిలేదు మంచి బిజీ సెంటర్లో రెస్టారెంట్ తెరవాల్సిన అవసరం లేకుండా పోతుంది ప్రస్తుతం సెంట్రలైజ్డ్ కిచెన్ క్లౌడ్ కిచెన్ అనేది మంచి కాన్సెప్ట్ గా ముందుకు వస్తోంది మీరు కూడా క్లౌడ్ కిచెన్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ ఏర్పాటుకు  ఎంత పెట్టుబడి పెట్టాలి అసలు ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.
 

క్లౌడ్ కిచెన్ అనేది. మీ ఇంటి వద్ద కూడా తెరవచ్చు.  అయితే దీనికి రెస్టారెంట్ ఉండదు అదొక్కటే తేడా,  ఇక ఆర్డర్ల విషయానికొస్తే కేవలం ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మాత్రమే మీరు కస్టమర్లకు మీ ఆహారాన్ని అందజేయాల్సి ఉంటుంది ఇందుకోసం జొమాటో స్విగ్గి వంటి డెలివరీ ఆప్స్ తో పాటు మీరు కూడా డెలివరీ సర్వీసు పెట్టుకుంటే సరిపోతుంది. 
 

క్లౌడ్ కిచెన్ ద్వారా లాభం ఏంటంటే మీరు మంచి సెంటర్లో రెస్టారెంట్ తెరవాల్సిన పనిలేదు తద్వారా మీకు రెస్టారెంట్ పెట్టుబడి డబ్బు సేవ్ అవుతుంది.  అద్దె గోల ఉండదు. పెద్ద పెట్టుబడి  పెట్టాల్సిన పనిలేదు. అంతే కాదు క్లౌడ్ కిచెన్ ద్వారా మీరు కస్టమర్లను నేరుగా పొందే అవకాశం ఉంది.  ఆన్లైన్ ద్వారా మీరు  కస్టమర్లను పొందుతారు.  తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికి ప్రారంభ పెట్టుబడి రూ. 2 లక్షల నుంచి మొదలవుతుంది. 
 

ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ద్వారా టాలీవుడ్ నటుడు నాగచైతన్య సైతం బిజినెస్ ప్రారంభించి చక్కటి ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ క్లౌడ్ కిచెన్ తెరిచేందుకు మీరు ఫుడ్ సెక్యూరిటీ సంస్థ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది అలాగే స్థానిక మున్సిపాలిటీ నుంచి కూడా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.  క్లౌడ్ కిచెన్ లో పని చేసేందుకు  వంట వాళ్లను హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో చిన్నపట్టణాల్లో సైతం క్లౌడ్ కిచెన్ సర్వీసులకు మంచి అవకాశం ఉంది. 
 

అయితే ఏ ఫుడ్ బిజినెస్  అయినా  ప్రాథమిక సూత్రం  రుచి నాణ్యత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే అది రెస్టారెంట్ అయినా క్లౌడ్ కిచెన్ అయిన చివరకు వీధి చివర  బజ్జీల బండి అయినా, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.  లేదంటే సక్సెస్ పొందలేరు. 

click me!