కొత్త బడ్జెట్‌లో నిరుద్యోగాన్ని తొలగించే అవకాశాలున్నాయని మధ్యతరగతి ప్రజలు ఫిబ్రవరి 1 కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై మధ్యతరగతి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం చాలా మధ్యతరగతి కుటుంబాలు బతకలేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి, తయారీ, సాంకేతికత , మౌలిక సదుపాయాల పరిశ్రమలలో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తోంది.