అయితే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది నేపాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వంట వాళ్ళు గుర్తొస్తారు. నిజానికి మీరు స్వయంగా చైనీస్ వంటకాలను నేర్చుకొని బిజినెస్ ప్రారంభిస్తే, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఒకవేళ మీకు కుదరకపోతే పని వాళ్ళను కూడా పెట్టుకుని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు కానీ మీరు స్వయంగా చైనీస్ వంటకాలపై అవగాహన ఉంచుకోవడం మంచిది. పనివాళ్ళు మానేసినప్పుడు మీరే స్వయంగా చైనీస్ వంటలను చేయాల్సి వస్తే, అందుకు సిద్ధంగా ఉండాలి అప్పుడే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వగలరు.