Business Ideas: ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, నెలకు లక్షల్లో ఆదాయం ఎలా పొందాలో తెలుసుకోండి

First Published Jan 19, 2023, 1:31 AM IST

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, మీ ప్రతిభకు తగ్గ సరైన ఉద్యోగం లేదని బాధపడుతున్నారా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు వెంటనే వ్యాపారం ప్రారంభించి మీరు మంచి ఆదాయం పొందే మార్గాన్ని చూసుకోండి.  తద్వారా మీ కుటుంబం ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు. 

 వ్యాపార రంగంలో అనేక అవకాశాలు మనకోసం సిద్ధంగా ఉంటాయి అయితే కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి ఈ రంగంలో రాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. 
 

ఈ మధ్యకాలంలో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పెళ్లిళ్లు పుట్టినరోజులు మరే ఇతర సందర్భాలైనా సరే. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు దగ్గరుండి మీ వేడుకను విజయవంతంగా జరుపుతున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాల్లో సైతం రకరకాల ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఈవెంట్లను సైతం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలే దగ్గరుండి సక్సెస్ చేస్తున్నాయి. ఇక కార్పొరేట్ సంస్థలు సైతం తమ కంపెనీ ఈవెంట్లు,  ప్రోడక్ట్ ప్రమోషన్ నిర్వహించేందుకు  ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలనే సంప్రదిస్తున్నాయి. 

కావున మీరు కూడా ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అనేది ఒక చక్కటి ఆప్షన్ అవుతుంది.  ముందుగా మీరు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి.  ఆ ఈవెంట్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు ఉండాలి.  ఉదాహరణకు పెళ్లి ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటే,  దానికి సంబంధించి పూర్తి అవగాహన మీకు ఉండాలి. ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధగా ఈవెంట్ నిర్వహించాల్సి ఉంటుంది.  కస్టమర్ల సాటిస్ఫాక్షన్ అనేది ఇందులో చాలా ముఖ్యం.  అదే మీ పెట్టుబడి. 
 

అలాగే బర్త్ డే ఫంక్షన్లు,  గెట్ టుగెదర్,  కార్పొరేట్ పార్టీలు వంటివి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు,  తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు చాలా దోహద పడతాయి. మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను విజయవంతంగా నడపాలి అనుకుంటే ఒక చక్కటి టీం అవసరం అప్పుడే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారు.  ప్రారంభంలో చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లను నిర్వహిస్తే నెమ్మదిగా పెద్ద ఈవెంట్లను నిర్వహించేందుకు సిద్ధమవచ్చు. 

 ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ఒక వెబ్సైట్ చాలా అవసరం తద్వారానే మీరు క్లైంట్లను కలుసుకోవచ్చు.  అలాగే పబ్లిక్ రిలేషన్ కూడా చాలా అవసరం అప్పుడే మీరు బిజినెస్ విస్తరించగలుగుతారు.  అన్నింటికన్నా ముఖ్యమైనది ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ లో నిజాయితీ నిబద్ధత నాణ్యత  అలాగే సమయపాలన కూడా చాలా అవసరం.  ప్రస్తుతం మార్కెట్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్నీ కూడా చిన్నస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగాయి ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రేయస్ మీడియా గ్రూప్  చిన్న చిన్న ఈవెంట్లనుంచి తమ ప్రయాణం ప్రారంభించే ఇప్పుడు దేశంలోనే అగ్రగామి ఈవెంట్ సంస్థగా మార్కెట్లో నిలబడింది. 
 

 ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ  స్థాపించడానికి ఎంత పెట్టు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా అయితే పెట్టుబడి కన్నా ముందు ప్లానింగ్ చాలా ముఖ్యం చక్కటి ప్లానింగ్ ఉంటే చాలు మీరు ఈ బిజినెస్ లో రాణించవచ్చు.  ముఖ్యంగా మీరు నిర్వహిస్తున్న  ఈవెంట్ సంబంధించి ఏ ఏ విభాగాల వారు అవసరమవుతారో వారందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ నడిపే వారికి ముఖ్యమైన పని. కోఆర్డినేషన్ ఉన్నప్పుడే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ముందు అడుగు వేస్తుంది. 

click me!