Business Ideas: ఈ బిజినెస్ చేస్తే ఏడాదికి రూ. 10 లక్షలు వెనకేసుకోవడం ఖాయం, చదువుతో సంబంధం లేదు

First Published Jan 19, 2023, 6:20 PM IST

వ్యాపారం ద్వారా మీరు విజయం సాధించాలని అనుకుంటున్నారా అయితే క్రమశిక్షణ నిబద్ధత నాణ్యత అనే మూడు సూత్రాలు వ్యాపారంలో  విజయం దక్కించుకోవచ్చు.  ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే కన్నా అదే శ్రమ వ్యాపారంలో పెడితే నెలకు కనీసం రూ.1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. 

చిన్నపిల్లల బట్టలు వ్యాపారం ప్రారంభించడం వల్ల మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  పెద్దవాళ్లకన్నా కూడా చిన్న పిల్లలకు బట్టలను ఎక్కువగా కొనేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు.  ఎందుకంటే ప్రతి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. దీంతో గత సంవత్సరం కొన్న బట్టలు ఈ సంవత్సరం వారికి సరిపోవు కావున మళ్లీ కొత్త బట్టలు కొనాల్సి ఉంటుంది.  ఇదే చిన్నపిల్లల బట్టల వ్యాపారంలో విజయ రహస్యం.  తల్లిదండ్రులు తాము బట్టలు కొనడం మానుకొని అయినా పిల్లల బట్టలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

మీరు కూడా చిన్న పిల్లల బట్టల వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏం చేయాలో ఎంత పెట్టుబడి పెట్టాలో ఈ వ్యాపారంలో ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
 

చిన్నపిల్లల బట్టలు వ్యాపారానికి మీరు ప్రత్యేకంగా ఓ షాపు పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది.  ఆ షాపు నుంచే మీరు ఈ బిజినెస్ లో రాణించవచ్చు.  చిన్న పిల్లల బట్టల వ్యాపారంలో  ముఖ్యంగా మీరు సరుకుని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేదే ముఖ్యమైనది.  మన దేశంలో హోల్సేల్ మార్కెట్ ద్వారా బట్టలను కొనుగోలు చేసి రిటైల్గా విక్రయిస్తే మంచి లాభం పొందే అవకాశం ఉంది.  అలాంటి హోల్సేల్ మార్కెట్లు గుజరాత్ లోని సూరత్, తమిళనాడులోని కోయంబత్తూర్,  వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పిల్లల బట్టలను హోల్సేల్గా విక్రయిస్తారు.  రిటైల్ గా విక్రయిస్తే చక్కటి లాభం పొందే అవకాశం ఉంది. 
 

సూరత్ లోని పలువురు తయారీదారులు సైతం నేరుగా మీరు ఉంటున్న ప్రాంతానికే దుస్తులను హోల్ సేల్  ధరలకు రవాణా పార్సెల్ చేస్తారు. తద్వారా మీకు సమయం కలిసి వస్తుంది లేదంటే మీరు సూరత్ వెళ్లి అక్కడే బట్టలను కొనుగోలు చేయవచ్చు షాపు రెంటు ఇతర ఖర్చులు తీసివేసి,  మీ లాభం  మార్జిన్ చూసుకుంటే సరిపోతుంది.  నిజానికి వస్త్ర వ్యాపారంలో సుమారు 30 శాతం నుంచి 50 శాతం వరకు లాభం ఉంటుంది చిన్న పిల్లల వస్త్రాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 
 

 పిల్లలను ఆకర్షించేలా మీ దుకాణాన్ని కార్టూన్ క్యారెక్టర్లతోనూ రంగురంగుల లైట్లతోనే అలంకరిస్తే మంచిది. . పిల్లల దుస్తుల్లో వారికి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ లను ఉండేలా చూసుకోవాలి.  మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి డిజైన్లను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.  అప్పుడే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.  అయితే మీరు ధరలను అందుబాటులో ఉంచడం ద్వారా కూడా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది ముఖ్యంగా పండుగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచితే ఎక్కువ మంది కస్టమర్లు మీ షాపులు సందర్శించే అవకాశం ఉంది. 

click me!