అయితే మీరు వెల్లుల్లిని హోల్ సేల్ గా మండీల్లో కొని రిటైల్ గా కిరాణా షాపులకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేడింగ్ పద్ధతిలో విభజిస్తారు 55 ఎంఎం ఉన్నటువంటి వెల్లుల్లి ధర ఒక కేజీ 150 వరకు పలుకుతుంది దీన్ని ఎక్స్పోర్ట్ సైతం చేస్తారు. 25 mm, 35, mm, 30mm, 45mm, 50-55 mm, 65mm సైజుల్లో వెల్లుల్లి అందుబాటులో ఉంటుంది. 20 నుంచి 30 ఎంఎం ఉన్నటువంటి వెల్లుల్లి ధర 100 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. ఇక పది రూపాయలకు కూడా ఒక కేజీ వెల్లుల్లి లభిస్తుంది. ఉదాహరణకు మనకు మార్కెట్లో లభించే వెల్లుల్లి ఒక కేజీ సుమారు 30 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది కానీ మనకు మాత్రం 100 రూపాయలకు కేజీ చొప్పున విక్రయిస్తారు. అంటే దాదాపు రెండు నుంచి మూడింతలు వరకు లాభం ఇందులో లభిస్తుంది.