మార్చి 28, 2018న హెచ్ఎఎల్ కంపెనీ లిస్ట్ అవగా, రూ.1130 వద్ద ఒక్కో షేర్ ధర పలికింది. అయితే అక్కడి నుంచి ఈ స్టాకు పెద్దగా పుంజుకోలేదు. 2020 ఏప్రిల్ 30వ తేదీన ఈ స్టాకు కనిష్ట స్థాయి అయినా 520 రూపాయల వద్దకు పడిపోయింది. అయితే హెచ్ఏఎల్ స్టాక్ క్రమంగా గడిచిన రెండు సంవత్సరాలుగా గమనించినట్లయితే, కనిష్ట స్థాయి అయిన 500 నుంచి ప్రస్తుతం ఏకంగా రూ. 2400 వరకు ఎగిసింది.