పడిలేచిన అదానీ, ఒక్క రోజే 20 శాతం లాభపడిన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్, ముందస్తు అప్పు చెల్లింపు నిర్ణయంతో జోష్

First Published Feb 7, 2023, 4:43 PM IST

హిండెన్ బర్గ్ రిపోర్టు దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ షేర్లు  నేడు వేగంగా కోలుకున్నాయి.. మంగళవారం ట్రేడింగ్ లోఅదాని ఎంటర్ప్రైజెస్ షేర్ లలో భారీగా కొనుగోళ్ల సందడి కనిపించింది దీంతో మదుపుదారులు ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా ఆదాని గ్రూప్ ప్రీ పే లోన్స్ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా షేర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. 

అదానీ గ్రూప్ షేర్లలో కొన్ని అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 20 శాతం జంప్ కనిపించగా, మరి కొన్ని స్టాక్స్‌లో  మాత్రం నస్టాల  ట్రెండ్ ఉంది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్, అదానీ విల్మార్ , అదానీ గ్రీన్ ఎనర్జీ లాభాల్లో ట్రేడ్ అవగా అదానీ టోటల్ గ్యాస్ , అదానీ పవర్‌ మాత్రం  క్షీణత కొనసాగింది.
 

అదానీ ఎంటర్‌ప్రైజెస్ 20 శాతం పుంజుకుంది. 
అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఈరోజు ప్రారంభ ట్రేడింగ్ నుండి  లాభాల బాటలో కొనసాగింది. స్టాక్‌లో 20 శాతం  లాభపడి అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో స్టాక్  ధర 1962.70కి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి ప్రధాని ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 1,813 (15.28%) వద్ద ముగిసింది. అటు అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్‌మిషన్  షేర్లు సైతం 4.99 శాతం అప్పర్ సర్క్యూట్‌ను  తాకాయి. అదానీ పోర్ట్ 7.43 శాతం, అదానీ గ్రీన్ 2.32 శాతం లాభపడ్డాయి.

ఈ స్టాక్స్‌లో పతనం కనిపించింది..
అదానీ గ్రూప్‌లోని కొన్ని షేర్లలో క్షీణత ధోరణి కనిపిస్తోంది. అదానీ పవర్ 3.37 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.00 శాతం తగ్గాయి. గత సాయంత్రం, అదానీ ట్రాన్స్‌మిషన్ డిసెంబర్ త్రైమాసికానికి బలమైన ఫలితాలను అందించింది. కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 73 శాతం పెరిగి రూ.478.15 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం కూడా 15.8 శాతం పెరిగి రూ.3,037 కోట్లకు చేరుకుంది.

ఇదిలా ఉంటే  పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూపు 1.1 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను ప్రిపే పద్ధతిలో ముందే  తిరిగి చెల్లిస్తున్నట్లు గౌతం అదానీ  తెలిపారు. దీంతో గ్రూప్ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ మంగళవారం 20 శాతం లాభపడింది. 
 

నిజానికి ఆదా నీకు గడచిన వారం రోజుల్లో గమనించినట్లయితే భారీగా నష్టపోయింది గ్రూపు చైర్మన్ అయినటువంటి గౌతమ్ అధాని సైతం ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానం నుంచి ఏకంగా 20వ స్థానం దిగువకు పడిపోయారు. దాదాపు 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ తుడిచిపెట్టుకుపోయింది.  అయితే హిండెన్ బర్గ్  రిపోర్ట్ పై అదానీ గ్రూపు ఇప్పటికే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. 

హిండెన్‌బర్గ్ ప్రభావం గౌతమ్ అదానీ ఆస్తుల నికర విలువ కూడా భారీగా పతనమైంది. డిసెంబర్ 13, 2022 నాటికి 134.2 బిలియన్ డాలర్లు ఉన్న అదానీ సంపద, కానీ ఇప్పుడు 63.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్‌లో నిరంతర పతనం కారణంగా, గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ ఆస్తుల  మధ్య అంతరం పెరిగింది.

Mukesh Ambani

ఫిబ్రవరి 1 నుంచి ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ జాబితాలో ముఖేష్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల నికర విలువ 82.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 

click me!