ఈ ఉద్యోగానికో దండంరా అనిపిస్తోందా.? ఇలా చేస్తే ఉన్న ఊరిలోనే నెల‌కు ల‌క్ష ఆదాయం ప‌క్కా

Published : Feb 18, 2026, 02:28 PM IST

Business Ideas: ఉద్యోగం చేసే చాలా మందికి వ్యాపారం చేయాల‌న్న కోరిక ఉంటుంది.  అయితే న‌ష్టాలు వ‌స్తాయ‌న్న భ‌యంతో వెనుక‌డుగు వేస్తుంటారు. మ‌రి న‌ష్టాలు త‌క్కువ‌గా ఉండి లాభాలు వ‌చ్చే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.

PREV
15
కొబ్బరి వ్యర్థాలతో కోట్ల వ్యాపారం

మన ఇళ్లలో, మార్కెట్‌లలో ప్రతిరోజూ వందలాది కొబ్బరికాయలు పగులగొడతాం. లోపలి గుజ్జు, నీరు వాడిన తర్వాత మిగిలేది పెంకు, పీచు. చాలా చోట్ల ఇవి చెత్తగా పడేస్తారు. కానీ అదే వ్యర్థాన్ని ముడి పదార్థంగా మార్చితే మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా మార్చుకోవ‌చ్చు. వ్యవసాయం, ఉద్యానవనం, ఎగుమతుల రంగంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, దశలవారీగా విస్తరించుకునే అవకాశమున్న రంగం ఇది.

25
కొబ్బ‌రి వ్య‌ర్థాల‌తో ఏం త‌యారు చేయొచ్చు.?

కొబ్బరి వ్యర్థాల నుంచి పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి:

కోకోపీట్:

కొబ్బరి పెంకును శుద్ధి చేసి, ఎండబెట్టి, మెత్తగా దంచి తయారు చేసే పదార్థం కోకోపీట్. ఇది భూమిలో తేమ నిల్వ ఉంచుతుంది. నర్సరీలు, టెర్రస్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ వంటి రంగాల్లో విస్తృతంగా వాడుతున్నారు. కోకోపీట్ ఇటుకలు, బ్లాకులు, గ్రో బ్యాగులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

తాళ్లు:

కొబ్బరి పీచుతో తాళ్లు తయారు చేయడం సాధారణంగా తెలిసిన వ్యాపారం. వ్యవసాయ క్షేత్రాల్లో, నిర్మాణ రంగంలో, అలంకరణ వస్తువుల తయారీలో వీటి వినియోగం ఉంది.

డోర్ మ్యాట్లు

కాయిర్ ఫైబర్‌తో మ్యాట్లు తయారు చేసి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు సరఫరా చేయవచ్చు.

ఇంధన బ్రికెట్స్

కొబ్బరి పెంకును పొడి చేసి బ్రికెట్స్‌గా తయారు చేస్తే హోటళ్లు, ఇండస్ట్రీలు కొనుగోలు చేస్తాయి. మంట మండించేందుకు వీటిని ఉప‌యోగిస్తారు.

35
ఎంత పెట్టుబ‌డి కావాలంటే.?

ఈ రంగంలో పెట్టుబడి మీరు ఎంచుకునే ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

చిన్న స్థాయి యూనిట్

స్థలం: 1,000–2,000 చదరపు అడుగులు

ముడి సరుకు: స్థానిక మార్కెట్ లేదా కొబ్బరి రైతుల నుంచి సేక‌రించాల్సి ఉంటుంది.

యంత్రాలు: ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్, స్క్రీనింగ్ మెషిన్, బ్లాక్ మేకింగ్ మెషిన్.

అంచనా పెట్టుబడి: రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు

మధ్యస్థ యూనిట్ అయితే సెమీ ఆటోమేటిక్ యంత్రాలు అవ‌స‌ర‌ప‌డ‌తాయి. అలాగే డ్రైయింగ్ యార్డ్, ప్యాకేజింగ్ సదుపాయం వంటివి ఉండాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రూ. 25 ల‌క్ష‌ల నుంచి రూ. 75 ల‌క్ష‌ల వ‌ర‌కు భారీ ఎత్తున పెట్టుబ‌డి అవ‌స‌ర‌ప‌డుతుంది. అయితే ఇందుకు త‌గ్గ‌ట్లుగానే లాభం ఉంటుంది. ప్రభుత్వ రుణ పథకాలు, MSME నమోదు ద్వారా సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది. సరైన ప్రణాళికతో రుణం తీసుకుంటే భారం తగ్గుతుంది.

45
తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?

కోకోపీట్ త‌యారీ విష‌యానికొస్తే ముందుగా కొబ్బరి పొట్టును రైతుల నుంచి లేదా మార్కెట్ యార్డ్‌ల నుంచి సేకరించాలి. అనంత‌రం పీచు, ఇతర మలినాలను వేరుచేయాలి. ఆ త‌ర్వాత నీటితో శుభ్రం చేసి, పూర్తిగా ఆర‌బెట్టాలి. చివ‌రిగా మీకు కావాల్సిన ఉత్ప‌త్తుల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

లాభాలు ఎలా ఉంటాయి?

ఈ రంగంలో లాభదాయకతకు ప్రధాన కారణాలు మూడు:

* ముడి సరుకు తక్కువ ధరలో లభిస్తుంది

* ప్రాసెసింగ్ ఖర్చు పరిమితంగా ఉంటుంది

* ఎగుమతుల్లో మంచి మార్జిన్ ఉంటుంది

చిన్న యూనిట్ నెలకు 15–20 టన్నుల కోకోపీట్ తయారు చేస్తే, అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత రూ.50,000 నుంచి రూ.1.5 లక్షల వరకు నికర లాభం పొందే అవకాశం ఉంటుంది. మధ్యస్థ యూనిట్ అయితే టర్నోవర్ కోటిన్నర నుంచి కొన్ని కోట్ల వరకు చేరవచ్చు. ఎగుమతుల ఒప్పందాలు కుదిరితే ఆదాయం మరింత పెరుగుతుంది. కాయిర్ తాళ్ల తయారీలో కూడా మంచి మార్జిన్ ఉంటుంది. సరైన మార్కెటింగ్ ఉంటే నెలకు స్థిర ఆదాయం పొందవచ్చు.

55
మార్కెటింగ్, విస్తరణ ఎలా చేయాలి?

స్థానిక నర్సరీలు, గార్డెన్ షాపులతో ఒప్పందాలు చేసుకోవాలి. ఆన్‌లైన్ B2B ప్లాట్‌ఫార్మ్‌లలో నమోదు చేయాలి. ఎగుమతి లైసెన్స్ తీసుకుని విదేశీ కొనుగోలుదారులతో సంప్రదించాలి. నాణ్యత సర్టిఫికేషన్ పొందితే విశ్వసనీయత పెరుగుతుంది. వ్యాపారం మొదట చిన్న స్థాయిలో ప్రారంభించి, డిమాండ్ పెరిగే కొద్దీ యంత్రాలు, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం మంచిది. చెత్తగా కనిపించే కొబ్బరి వ్యర్థాలు సరైన ప్రణాళికతో పెద్ద వ్యాపార అవకాశంగా మారవచ్చు. సరైన అధ్యయనం, క్రమశిక్షణ, మార్కెటింగ్ ఉంటే ఈ రంగంలో స్థిరమైన ఆదాయం సాధ్యమే.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఈ రంగంలో అనుభ‌వం ఉన్న వారిని నేరుగా సంప్ర‌దించ‌డ‌మే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories