మీరు అద్భుతంగా వంట చేయ‌గ‌ల‌రా.. అదృష్టం మీదే. క్లౌడ్ కిచెన్‌తో ల‌క్ష‌ల్లో ఆదాయం

Published : Mar 31, 2026, 02:23 PM IST

Business Ideas: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది హోటళ్లకు వెళ్లకుండా జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌తో కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న వ్యాపారం క్లౌడ్ కిచెన్.  

PREV
15
క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటి?

క్లౌడ్ కిచెన్ అనేది కస్టమర్లు వచ్చి కూర్చొని తినే హోటల్ కాదు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కోసం మాత్రమే పనిచేసే కిచెన్. ఈ విధానంలో మీరు ఇంట్లో లేదా చిన్న ప్రదేశంలో వంటలు తయారు చేసి వాటిని ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా కస్టమర్లకు పంపిస్తారు. కస్టమర్లు యాప్‌లో ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఆహారం తయారు చేసి డెలివరీ పార్ట్‌నర్ ద్వారా పంపిస్తారు. అందువల్ల రెస్టారెంట్ లాగా పెద్ద హాల్, ఫర్నిచర్, సర్వీస్ స్టాఫ్ వంటి ఖర్చులు అవసరం ఉండవు.

25
క్లౌడ్ కిచెన్ ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యాపారం ప్రధానంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా నడుస్తుంది. ముందుగా మీరు మీ బ్రాండ్ పేరుతో ఒక మెనూ తయారు చేస్తారు. తర్వాత జొమాటో లేదా స్విగ్గీ వంటి యాప్‌లలో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ మెనూ ఆ యాప్‌లో కనిపిస్తుంది. కస్టమర్లు యాప్‌లో మీ ఫుడ్‌ను చూసి ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఆహారం తయారు చేసి ప్యాక్ చేస్తారు. తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ఆ ఫుడ్‌ను కస్టమర్‌కు చేరుస్తాడు. ఇలా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఈ వ్యాపారం కొనసాగుతుంది.

35
జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఎలా విక్రయించాలి?

మీరు ఇంట్లో తయారు చేసే ఫుడ్‌ను అమ్మాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. మొదటగా FSSAI ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇది ఆహార వ్యాపారం కోసం అవసరమైన ప్రభుత్వ అనుమతి. ఆ తర్వాత Zomato, Swiggy Merchant Partnerగా రిజిస్టర్ కావాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ కిచెన్ అడ్రస్, లైసెన్స్ వివరాలు, మెనూ వంటి సమాచారం ఇవ్వాలి. మెనూ లిస్ట్‌లో మీరు తయారు చేసే వంటకాలు, ధరలు, ఫుడ్ ఫోటోలు పెట్టాలి. మంచి ఫోటోలు, సరైన ధరలు ఉంటే కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది.

45
ఎంత పెట్టుబడి అవసరం?

క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. ఇంట్లోనే ప్రారంభిస్తే సుమారు రూ. 30,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. ఈ ఖర్చులో కిచెన్ పరికరాలు, గ్యాస్ స్టౌవ్, పాత్రలు, ప్యాకేజింగ్ మెటీరియల్ వంటి వాటి ఖర్చు ఉంటుంది. మీరు ప్రత్యేకమైన వంటకాలతో ప్రారంభిస్తే కస్టమర్లు త్వరగా ఆకర్షితులు అవుతారు. ఉదాహరణకు హోమ్ స్టైల్ ఫుడ్, బిర్యానీ, టిఫిన్స్, స్నాక్స్ వంటి ఐటమ్స్ మంచి డిమాండ్‌లో ఉంటాయి.

55
లాభాలు ఎలా ఉంటాయి?

క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ప్రధానంగా ఖర్చులు తక్కువగా ఉండటం ఒక పెద్ద ప్రయోజనం. రెస్టారెంట్ లాగా రెంట్, స్టాఫ్ ఖర్చులు ఎక్కువగా ఉండవు. రోజుకు 30 నుంచి 50 ఆర్డర్లు వచ్చినా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మంచి ఫుడ్ క్వాలిటీ, టైమ్‌కు డెలివరీ ఉంటే కస్టమర్లు మళ్లీ మళ్లీ ఆర్డర్ చేస్తారు. కొంతకాలం తర్వాత మీ బ్రాండ్‌కు పేరు వస్తే రోజుకు వందల ఆర్డర్లు కూడా రావచ్చు. అప్పుడు ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద, వంట చేయడం తెలిసిన వారికి క్లౌడ్ కిచెన్ ఒక మంచి బిజినెస్ ఐడియా. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ప్రారంభించి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కస్టమర్లకు ఫుడ్ అందించి మంచి ఆదాయం సంపాదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories