Today Gold Price: పసిడి ప్రియులకు బిగ్ షాక్..అక్షయ తృతీయ, ఇరాన్ వార్ ఎఫెక్ట్!

Published : Mar 31, 2026, 11:31 AM IST

Today Gold Price: పసిడి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి, తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు ఆశలు ఆవిరయ్యాయి. గత ఐదు రోజులలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.4,740 పెరిగింది.  

PREV
14
పసిడి ప్రియుల ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు

బంగారం రేట్లు కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లాయి. ధరలు తగ్గాయన్న వాళ్ల ఆనందాన్ని దెబ్బకొట్టాయి. నెమ్మదిగా పెరగడం మొదలైంది. గత మూడు రోజులుగా పసిడి ఎగబాకుతోంది. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగిలింది. కానీ పెట్టుబడిదారులు ఖుషీఖుషీగా ఉన్నారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొనుగోలుదారుల కంటే ఇన్వెస్టర్లే...ఎక్కువ అయోమయంలో ఉన్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంత వేగంగా తగ్గిందో...అదే వేగంతో పెరుగుతోంది.

24
బంగారం ధరలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం

ప్రపంచ రాజకీయ పరిస్థితులు బంగారం ధరలపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం గోల్డ్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఆయిల్ ట్యాంకర్లపై దాడులు, క్షిపణి దాడులు, ప్రతిదాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారులను సేఫ్ హావెన్‌గా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అలాగే హర్మూజ్ మార్గంలో నౌకలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన ఎనర్జీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దీంతో ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

34
మేలిమి పసిడి రూ.1,49,290

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.950 పెరిగి రూ.1,36,850 వద్దకు వచ్చింది. ఇక వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2.50లక్షలకు పడిపోయంది. విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తా రేట్లు ఒకేలా ఉన్నాయి. 

44
అక్షయ తృతీయ ఎఫెక్ట్

ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చూస్తే కొనుగోలుదారులు డైలమాలో ఉన్నారు. అక్షయ తృతీయ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడే కొనాలా లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా అన్న సందేహం నెలకొంది. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ. సో ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories