చోటు మహారాజ్ పేరిట ఏర్పాటైన ఈ ఫ్రాంచైజీ కింద అతి తక్కువ ధరకే మనం ఇంటర్ నిర్మాణం చేసుకోవచ్చు.100 మంది కూర్చొని సినిమా చూడగలిగే థియేటర్ ను ఈ కాన్సెప్ట్ కింద ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మినీ థియేటర్ ను టైర్ 2, టైర్ 3 నగరాలు, తహసీల్‌లు, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఈజీ, దీని పెట్టుబడికి, సుమారు 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుంది. అలాగే ఈ థియేటర్ కు అనుబంధంగా ఒక రెస్టారెంట్ అలాగే క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది.