ఇలా ఓవైపు నెట్‌వర్క్ విస్తృతిని పెంచుతూనే మరోవైపు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే యూజర్లను దృష్టిలో పెట్టుకొని బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 6 నెలల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.