ఫ్రీలాన్సింగ్
ఫ్రీలాన్సింగ్ కూడా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారమే. మీరు ఎంచుకున్న రంగంలో దేనికైనా డిమాండ్ ఉందో దాన్ని మీరు ముందుగానే సిద్దం చేసుకొని పెట్టుకోండి. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్, మూవీ స్టోరీస్, షార్ట్ స్టోరీస్, స్టోరీ ఐడియాస్ ఇలా మీ దగ్గర ముందుగా సిద్ధంగా ఉంటే అవి నచ్చిన వారు వెంటనే మీ దగ్గర తీసుకొని మంచి అమౌంట్ ఇస్తారు.
ఇంటి తోట
చాలామంది ఇంట్లో తోట వేస్తున్నారు. ఇంటి తోట, కూరగాయల తోట ఇప్పుడు చాలా ఫేమస్. వాటికి కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌లో అమ్మొచ్చు. లేదా తోట సెటప్ అంతా తీసుకెళ్లి వారి టెర్రస్ పై ఏర్పాటు చేయొచ్చు. ఇది కూడా స్పాట్ పేమెంట్, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్.