BSNL మదర్స్ డే స్పెషల్: మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

Published : May 09, 2025, 03:51 PM IST

BSNL Mothers Day Offer: మదర్స్ డే సందర్భంగా BSNL తన మూడు బెస్ట్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ప్రకటించింది. మాతృ దినోత్సవం మే 11న వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని BSNL తన అధికారిక X ఖాతా ద్వారా మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
15
BSNL మదర్స్ డే స్పెషల్: మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.2399, రూ.997, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 5% డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ మే 7 నుండి మే 14, 2025 వరకు BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసేవారికి వర్తిస్తుంది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25

395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్

రూ.2399 ప్లాన్‌ను డిస్కౌంట్ తర్వాత రూ.2279కి పొందవచ్చు. ఈ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ కాలంలో డేటా లేకుండా మొబైల్ ఉపయోగించడం కష్టం. అందులోనూ తక్కువ డేటా లభించినా సరిపోదు. అందుకే బీఎస్ఎన్ఎల్ ఏకంగా రోజుకు 2 జీబీ డేటా ఇస్తోంది. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMS‌లు, BiTV యాక్సెస్‌తో పాటు 350కి పైగా లైవ్ టీవీ ఛానల్స్‌ను చూడవచ్చు.

35

160 రోజుల వ్యాలిడిటీ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు రూ.997తో ఒక అద్భుతమైన ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రస్తుతం రూ.947కే పొందవచ్చు. ఇది 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 100 SMS‌లు, BiTV యాక్సెస్‌ను అందిస్తుంది.

45

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్

సుమారు 3 నెలలకు సరిపడే రీఛార్జ్ ప్లాన్ కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు రూ.599 ప్లాన్‌ సరిపోతుంది. ఇది మదర్స్ డే సందర్భంగా కేవలం ను రూ.569కే పొందవచ్చు. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు ఏకంగా 3GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS‌లు, BiTV యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

55

ఈ మదర్స్ డే ఆఫర్స్ తో వినియోగదారులు తమ BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఉపయోగించి, వినియోగదారులు రూ.120 వరకు సేవ్ చేయవచ్చు.

వినియోగదారులు ఈ ఆఫర్‌ను BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందవచ్చు. ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీచార్జ్ చేసిన వారికి ఈ డిస్కౌంట్ వర్తించదు.

 

Read more Photos on
click me!

Recommended Stories