BSNL Budget Recharge Plan : స్టూడెంట్స్ డే సందర్భంగా ఇటీవల బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. దాని గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు… కేవలం రూ.8-9 ఖర్చుతో ఎన్ని బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసా?
BSNL Student Recharge Plan : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇటీవల తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ను ఉపయోగించే స్టూడెంట్స్ కి చిల్ట్రన్స్ డే సందర్భంగా ప్రత్యేక రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేసింది. కేవలం 8-9 రూపాయలకే ఒకరోజంతా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు పొందే అద్భుత అవకాశం కల్పించింది.
25
కేవలం రూ.8-9 కే ఇన్ని ఆఫర్లా..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎస్ ఇటీవల చిల్ట్రన్ డే కు 'స్టూడెంట్ స్పెషల్' పేరిట రూ.251 స్పెషల్ రీచార్జ్ ప్లాన్ ప్రకటించింది. 'చదవండి, ఆడండి, బిఎస్ఎన్ఎల్ తో కనెక్ట్ అయి వుండండి'' అంటూ ట్విట్టర్ వేదికన కొత్త ప్లాన్ ను ప్రకటించింది. ఈ రీచార్జ్ ప్లాన్ కేవలం నెలరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది... కాబట్టి వెంటనే రీచార్జ్ చేసుకొండి... బెనిఫిట్స్ పొందండి.
35
BSNL స్టూడెంట్ ప్లాన్ వివరాలు
251 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అంతేకాదు 100GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నన్నిరోజులు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కొత్త, పాత కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఈ స్టూడెంట్ స్పెషల్ రీచార్జ్ ప్లాన్ గురించి బిఎస్ఎన్ఎల్ సిఎండి ఏ.రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ... దేశీయంగా తయారు చేసిన BSNL 4G నెట్‌వర్క్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చని అన్నారు. ఇటీవల మేక్ ఇన్ ఇండియా స్పూర్తిని అందిపుచ్చుకుని స్వదేశీ పరిజ్ఞానంతో 4G సేవలను అందిస్తోంది బిఎస్ఎన్ఎల్. ఇలా 4జి టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐదో దేశం భారత్ నిలిచిందని రాబర్ట్ జె. రవి గుర్తుచేశారు.
55
విద్యార్థులకు బడ్జెట్ ప్రెండ్లీ ఆఫర్
ఎక్కువ డేటా అవసరమయ్యే విద్యార్థులకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ అని రాబర్ట్ జె. రవి అన్నారు. BSNL 4G సేవలను చూశాక విద్యార్థులు తమతోనే దీర్ఘకాలం కొనసాగుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్ డిసెంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేస్తోంది.