మైక్రోసాఫ్ట్ ఉద్యోగితో బిల్ గేట్స్ అఫైర్.. ? దర్యాప్తు పూర్తయ్యేలోగా డైరెక్టర్ పదవికి రాజీనామా..

First Published May 17, 2021, 12:02 PM IST

 వాషింగ్టన్: లైంగిక వేధింపుల ఆరోపణల మధ్య ప్రపంచ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలియనీర్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ నివేదికను  ప్రచురించింది. 
 

20 మార్చి 2020న మైక్రోసాఫ్ట్ బోర్డు డైరెక్టర్ల నుండి బిల్ గేట్స్ రాజీనామా చేశారు. తన పదవి నుంచి వైదొలగడంపై స్వచ్ఛంద కార్యక్రమాల పై దృష్టి పెట్టడానికి అని వివరణ ఇచ్చారు. ఏదేమైనా, సంస్థ ఉద్యోగితో సాన్నిహిత్య సంబంధం ఆరోపణలపై కంపెనీ దర్యాప్తు పూర్తయ్యేలోపు బిల్ గేట్స్ రాజీనామా చేసినట్లు తెలిసింది.
undefined
మైక్రోసాఫ్ట్‌లో ఒక ఉద్యోగితో సంబంధాన్ని కొనసాగిస్తూ బిల్ గేట్స్ కంపెనీ బోర్డు సభ్యుడిగా కొనసాగడం సరైనది కాదని బోర్డు తీర్పు ఇచ్చినట్లు కంపెనీకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్వయంగా కంపెనీ బోర్డుతో ఒక లేఖలో తనకు గతంలో బిల్ గేట్స్‌తో సన్నిహిత సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత 2019లో బిల్ గేట్స్‌పై సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.
undefined
దర్యాప్తు కొనసాగుతున్నందున బిల్ గేట్స్ డైరెక్టర్‌గా కొనసాగడం అనైతికమని కొందరు బోర్డు సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో దర్యాప్తు పూర్తయ్యేలోపు బిల్ గేట్స్ బోర్డు నుండి తన పదవికి రాజీనామా చేశారు.
undefined
మైక్రోసాఫ్ట్ ఉద్యోగి, బిల్ గేట్స్ 2000 సంవత్సరంలో తనతో సన్నిహితంగా ఉన్నారని ఒక లేఖ ద్వారా కంపెనీకి తెలిపారు. లేఖ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈ సంఘటనపై న్యాయ సంస్థ సహాయంతో "సమగ్ర దర్యాప్తు" నిర్వహించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. దర్యాప్తులో ఉద్యోగికి కంపెనీ పూర్తి సహకారాన్ని అందించిందని కంపెనీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. దర్యాప్తుపై మైక్రోసాఫ్ట్ పూర్తి వివరాలను అందించలేదు.
undefined
బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించారు. 2000 వరకు మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓగా పనిచేశారు, అదే సంవత్సరంలో అతని ఫౌండేషన్ కూడా ప్రారంభించబడింది. ఫిబ్రవరి 2014 వరకు దాని ఛైర్మన్‌గా ఉన్నారు.
undefined
అయితే బిల్ గేట్స్ రాజీనామాకు దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీలో ఉన్న కొన్ని వర్గాలు తెలిపాయి. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైన సంబంధం వారిది. ఇది చాలా స్నేహపూర్వకంగా ముగిసిందని ఆయన అన్నారు.
undefined
బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాన సంగతి మీకు తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగిన 27 సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకుంది.మే 3న మెలిండా బిల్ గేట్స్ నుండి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగితో సంబంధం విడాకులకు దారితీసిందని గతంలో కూడా వార్తలు వచ్చాయి.
undefined
click me!