కరోనా లాక్ డౌన్ సామ్యంలో మీ పిల్లలకు డబ్బు ప్రాముఖ్యతను ఈ సులభమైన మార్గాల్లో నేర్పించండి..

First Published May 15, 2021, 7:08 PM IST

 కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను ఆర్ధికంగా సంక్షోభంలోకి  నేట్టింది. ఈ కారణంగా చాలా ప్రాంతాలలో వ్యాపారులు నష్టాలను ఎదురుకొన్నారు. కరోనా యుగంలో డబ్బును సురక్షితమైన  పెట్టుబడుల విభాగంలో పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితితులో ప్రజలు ఆర్థిక ప్రణాళిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ముఖ్యం.

డబ్బు ప్రాముఖ్యత గురించి పిల్లలకు చెప్పడం, వారిలో మంచి ఆర్థిక అలవాట్లను పెంపొందించడం వారి భవిష్యత్తును నిర్ధారిస్తుంది. చిన్న వయస్సులోనే పిల్లలకు సరైన ఆర్థిక విద్యను ఇస్తే, అది వారికి డబ్బు ఆదా చేయడం లేదా డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియజేస్తుంది. అప్పుడు వారి భవిష్యత్ సులభంగా ఉంటుంది ఇంకా భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితులను వారు సులభంగా ఎదుర్కోగలుగుతారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని మార్గాల గురించి తెలుసుకోండి..
undefined
పొదుపు ప్రాముఖ్యతమీరు ప్రతి నెలా మీ పిల్లలకి పాకెట్ మనీగా చిన్న మొత్తాన్ని ఇస్తుంటారు. దీనికి బదులు వారికి పిగ్గీ బ్యాంక్ ఇవ్వండి లేదా డబ్బు ఆదా చేసే మార్గాన్ని చూపించండి. మీ పిల్లలకు డబ్బు ఇవ్వడం ద్వారా వారికి కొంత డబ్బు ఎలా ఆదా చేయాలో వారికి నేర్పించవచ్చు. ఇలా చేయడం ద్వారా వారు క్రమంగా గణనీయమైన మొత్తాన్ని సేవింగ్స్ చేయగలుగుతారు. తరువాత వారు సేవింగ్స్ నుండి కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులలో డబ్బును ఏర్పర్చుకోవడంలో ఇబ్బంది ఉండదు.
undefined
సాధించాల్సిన లక్ష్యాలను నేర్పండిమీరు చిన్న లక్ష్యాలను సాధించేందుకు మీ పిల్లలను ప్రేరేపించండీ. మీ పిల్లలకు ప్రతినెలా 1,000 రూపాయలు సేవింగ్స్ చేస్తే వారికి ఇష్టమైన బొమ్మలను కొనుగోలు చేయవచ్చని చెప్పండి. ఒకవేళ వారు అంతా డబ్బును ఆదా చేయకపోతే మీరు రూ.4,000-రూ.5,000 జమ చేయడం ద్వారా మంచి సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పండి. ఈ విధంగా వారు చిన్న లక్ష్యాలకు అనుగుణంగా ఖర్చు చేసే అలవాటు నేర్పిచండి, ఇది వారికి ముందుముందు ఎంతో సహాయపడుతుంది.
undefined
ఇంటి ఖర్చులుతల్లిదండ్రులు పిల్లలతో డబ్బు ఖర్చు చేయడం గురించి బహిరంగంగా మాట్లాడాలి. అలాగే పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. సేవింగ్స్ ఇంకా ఖర్చుల గురించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలని ఇంటి ఆర్థిక వ్యవస్థకు కనెక్ట్ చేయండి. వారితో కలిసి ఒక చిన్న షాపింగ్ జాబితాను రూపొందించండి. అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుందో లెక్కించండి. ఇలా చేయడం ద్వారా వారు చిన్న వయస్సులోనే సేవింగ్స్ ప్రాముఖ్యతను నేర్చుకోవచ్చు.
undefined
డిస్కౌంట్లతో చిక్కుకోకండిచాలా షాపులు, వెబ్‌సైట్లు వస్తువులపై డిస్కౌంట్లను అందిసస్తుంటాయి వాటిని నివారించాలని. ఎందుకంటే డిస్కౌంట్ రెండు విధాలుగా లభిస్తుంది. మొదటి క్యాష్ తగ్గింపు, రెండవది సాధారణ తగ్గింపు. కంపెనీలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై క్యాష్ తగ్గింపును అందిస్తాయి. ఈ తగ్గింపు ఎం‌ఆర్‌పిలో లభిస్తుంది. డీలర్లను బట్టి డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా కొనడానికి ముందు దానిని పరిగణించండి. ఎందుకంటే దాని వల్ల మీరు చాలా ఆదా చేయవచ్చు.
undefined
click me!