చలికాలంలో వాటర్‌ కెటిల్‌ కొంటున్నారా? రూ. వెయ్యి లోపు బెస్ట్‌ ఆప్షన్స్‌..

First Published | Dec 21, 2024, 5:07 PM IST

చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో చల్లటి నీటిని తాకాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. అందుకే వాటర్‌ కెటిల్స్‌ వినియోగం పెరుగుతోంది. మరి మీరు కూడా కెటిల్స్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ కెటిల్స్‌పై ఓ లుక్కేయండి.. 
 

గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే స్టౌవ్‌పైన నీటిని వేడి చేసుకుని తాగాలంటే కాస్త శ్రమ, సమయంతో కూడుకున్న పని. అందులోనూ ట్రావెల్ చేసే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అందుబాటులోకి వచ్చినవి వాటర్‌ కెటిల్స్‌. వీటితో నీటిని సులభంగా వేడి చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో తక్కువ ధరలో పలు కెటిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Pigeon by Stovekraft

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కెటిల్స్‌లో ఇది ఒకటి. పీజియన్‌ కంపెనీకి చెందిన ఈ కెటిల్‌ అసలు ధర రూ. 1245కాగా 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 599కే లభిస్తోంది. ఈ కెటిల్‌ 1.5 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. స్టైయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కెటిల్‌ 240 వోల్టేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే 1.5 లీటర్ల నీరు వేడెక్కుతుంది. 


Butterfly EKN 1.5 Litre

బటర్‌ ఫ్లై కంపెనీకి చెందిన ఈ వాటర్‌ కెటిల్‌ అసలు ధర రూ. 1299కాగా 54 శాతం డిస్కౌంట్‌తో రూ. 599కే లభిస్తోంది. స్టైయిన్‌ లెస్‌ స్టీల్‌తో తీసుకొచ్చిన ఈ కెటిల్‌లో 360 డిగ్రీల స్వీవెల్‌ పవర్‌ బేస్‌ను అందించారు. డ్రై బాయిల్ ప్రొటెక్షన్‌ ఈ కెటిల్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్‌గా చెప్పొచ్చు. 1.5 లీటర్‌ కెపాసిటీ, 230 వోల్టేజ్‌, 1500 వాట్స్‌ కెపాసిటీ ఈ కెటిల్ సొంతం. 
 

Prestige 1.5 Litres Electric Kettle

ప్రెస్టీజ్‌ కంపెనీకి చెందిన ఈ వాటర్‌ కెటిల్‌ అసలు ధర రూ. 1445కాగా అమెజాన్‌లో 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 699కి లభిస్తోంది. ఇందులో సింగిల్‌ టచ్‌ లిడ్‌ లాకింగ్‌, రొటేటబుల్‌ బేస్‌, పవర్‌ ఇండికేటర్‌ వంటి ఫీచర్లను అందించారు. నీరు వేడేక్కగానే ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అయిపోతుంది. 
 

Milton Euroline Go Electro 2.0

మిల్టన్‌ కంపెనీకి చెందిన ఈ కెటిల్ అసలు ధర రూ. 1599కాగా అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 799కే లభిస్తోంది. ఇందేలో 360 డిగ్రీస్‌ కనెక్టర్‌ను ఇచ్చారు. ఆటో కటాఫ్‌ వంటి ఫీచర్‌ను అందించారు. అలాగే 1500 వాట్స్‌ పవర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 2 లీటర్ల కెపాసిటీతో ఈ కెటిల్‌ను తీసుకొచ్చారు. 
 

Prestige Stainless Steel 1.5 Litre Kettle

ఈ కెటిల్ అసలు ధర రూ. 1245 కాగా అమెజాన్‌లో 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 649కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ కెటిల్‌ను 1.5 లీటర్‌ కెపాసిటీతో తీసుకొచ్చారు 1500 వాట్స్‌, 230 వోల్టేజ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కంపెనీ ఏడాది వారెంటీని అందిస్తోంది. 

Latest Videos

click me!